ఆ సమస్యలపై టీడీపీ దృష్టి పెట్టాల్సిందే.. వాళ్లకు మేలు చేస్తే టీడీపీకే మేలు!

Reddy P Rajasekhar
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో టమోటా, ఉల్లి, కందిపప్పు, బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నా ఏపీలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు, పరిమిత వేతనంతో జీవనం సాగించే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. టమోటా, ఉల్లి రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలకే అందించే దిశగా టీడీపీ అడుగులు వేయాల్సి ఉంది.
 
ఏమీ కొనలేము ఏమీ తినలేము అనే పరిస్థితి ఉందని సామాన్య ప్రజలు చెబుతున్నారు. ధరల పెరుగుదల వల్ల ఆదాయం పెరుగుతున్నా ఏ మాత్రం ఫలితం లేకుండా పోతుందని వాళ్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కూరగాయల ధరలు పెరిగిన సమయంలో రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలకే వాటిని పంపిణీ చేయడం కొత్తేం కాదు. ఆధార్ కార్డ్ నంబర్ల ద్వారా గతంలో కూరగాయల పంపిణీ జరిగింది.
 
ఈ విధంగా చేయడానికి ప్రభుత్వంపై పడే భారం కూడా మరీ భారీ మొత్తంగా ఉండదు. జగన్ దిగిపోయినా ధరలు పెరిగాయంటూ ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారం విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా పార్టీ మునిగిపోతుందనే సత్యాన్ని సైతం బాబు గమనించాల్సి ఉంది. ఇతర రాష్ట్రాలతో ఏపీలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువనే భావన ప్రజల్లో ఉంది.
 
టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడం పార్టీకి తీరని నష్టం చేస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. చంద్రబాబు, కూటమి మంత్రులు వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. మార్కెట్ లో 100 రూపాయల నోటుకు విలువే లేకుండా పోయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు మేలు చేస్తే టీడీపీకే మేలు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ పెరుగుతున్న ధరల విషయంలో ఏం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: