ఆ బలం సరిపోదు జగన్.. ఈ బలం కూడా తోడైతేనే వైసీపీకి పూర్వ వైభవం వస్తుందా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి పూర్వ వైభవం రావడం సాధ్యమేనా అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే పరిస్థితి ఒకలా ఉంటుందని నిలబెట్టుకోకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గత ఐదేళ్లలో జగన్ ఏపీలో యువతకు ఉపయోగపడే అభివృద్ధి మాత్రం చేయలేదని కామెంట్లు వ్యకమవుతున్నాయి.
 
2019 ఎన్నికల్లో ప్రజలు అభ్యర్థుల గురించి పట్టించుకోకుండా జగన్ ను నమ్మి జగన్ చెప్పిన పథకాలు నచ్చి ఓట్లేశారు. అయితే ఆ మ్యాజిక్ ప్రతి సందర్భంలో జరగదు. ఎన్నికల్లో విజయం సాధించాలన్నా పార్టీపై ప్రజల్లో సదభిప్రాయం కలగాలన్నా బలమైన నేతలు పార్టీకి అవసరమని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులను మార్చినా ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదో జగన్ గ్రహించాల్సి ఉంది.
 
కేవలం సంక్షేమం మాత్రమే ప్రజల్లో మంచి పేరు తెచ్చిపెడుతుందని అనుకుంటే పొరపాటు అవుతుంది. సంక్షేమ పథకాలను ఎక్కువ సంఖ్యలో అమలు చేసినా అంతకుమించి పథకాలను మరో పార్టీ ప్రకటిస్తే ఆ పార్టీ వైపు ప్రజలు ఆసక్తి చూపే అవకాశం అయితే ఉంటుంది. వైసీపీ ఓటమికి కారణమైన కారణాలను గ్రహించి ఆ తప్పులను సరిదిద్దుకునే దిశగా జగన్ అడుగులు వేయాల్సి ఉంది.
 
ఈవీఎంల విషయంలో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే నష్టమే తప్ప లాభం ఉండదు. సొంత జిల్లాలోనే ఊహించని ఫలితాలు రావడం వైసీపీకి తీరని నష్టం చేస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. మొదట రాయలసీమలో వైసీపీ పుంజుకుంటే ఇతర జిల్లాల్లో సైతం పరిస్థితులు మారే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. వైసీపీ ఓటమికి ఐప్యాక్ కూడా ఒక విధంగా చాలామంది భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ కామెంట్స్, ఇండియా టుడే సర్వే నిజమయ్యాయని ఈ సందర్భంగా చెబుతున్నారు. జగన్ తెలివిగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: