“క్రికెట్ బోర్డు” సంచలనం...“షోయబ్ అక్తర్” కి కీలక పదవులు!!!

Bhavannarayana Nch

షోయబ్ అక్తర్ ఈ పేరు చెప్తే చటుక్కున గుర్తుకు వచ్చేది..వేగంగా దూసుకువెళ్ళే బంతులు..ఆ వేగం తాలూకు రికార్డులు..అప్పట్లో తాను  విసిరిన బంతి వేగం ఎంత ఉంది అని అంచనాలు వేసుకునే వారు..తన దగ్గర నుంచీ వేగంగా ఎవరు బంతిని విసురుతారు అనే స్కోర్ రికార్దులు కూడా వచ్చాయి..అయితే ఇప్పుడు ఈ పాకిస్తానీ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ కి అరుదైన గుర్తింపు లభించింది..అదేమిటంటే.

 

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లో కీలక మార్పులు చేశారు..ఒకే సారి అక్తర్‌కు రెండు ముఖ్యమైన పదవులు కట్టబెడుతున్నట్లు బోర్డు శనివారం ప్రకటించింది...పీసీబీ బ్రాండ్‌అంబాసిడర్‌తోపాటు సలహాదారు పదవుల్లో అక్తర్‌ను నియమించారు...క్రికెట్ వ్యవహారాలలో పీసీబీకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులు అయ్యారని చైర్మన్‌ నిజం సేథీ తెలిపారు

 

అయితే ఈ విషయంలో అక్తర్ బోర్డు నిర్ణయంపై సంతృప్తిని వ్యక్తం చేశాడు..తన 14 ఏళ్ల కెరీర్‌లో దేశానికి ఏవిధంగా సేవలు చేశానో, అదే స్ఫూర్తిని కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు...రిటైర్మెంట్‌ తర్వాత కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు బోర్డుపై చేస్తూ వచ్చారు..సేథీ చైర్మన్‌గా ఉంటే పాక్‌ క్రికెట్‌కు కష్టాలు ఉంటాయని అనేవారు..అలాంటి వీరు ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని స్నేహితుల్లా కలిసి ఉండటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించడం పీసిబీ లో చర్చకి దారి తీస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: