2025: టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇక్కడ ఉంది, చూడండి!
ఇకపోతే ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరగబోతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్టు జనవరి 3 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత్.. ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. అయితే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత జరిగే మ్యాచ్‌లకు మాత్రం సంబంధించి తేదీ, వేదిక ఖరారు కావాల్సి ఉంది. ఈ సిరీస్ తర్వాత.. స్వదేశంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో రెండేసి చొప్పున టెస్టులు ఆడనుంది టీమిండియా. ఆ తర్వాత బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలో పర్యటించి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడనుంది. టీ20ల విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌లో 3 టీ20లు, ఆసియా కప్, ఆస్ట్రేలియాలో 5 టీ20లు.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో ఈ సంవత్సరం అయితే టీమిండియా బిజీ అవనుంది.
2025: టీమిండియా పూర్తి షెడ్యూల్:
భారత్-ఇంగ్లాండ్ టీ20 షెడ్యూల్:
తొలి T20: జనవరి 22 (కోల్‌కతా)
రెండో T20: జనవరి 25 (చెన్నై)
మూడో T20: జనవరి 28 (రాజ్‌కోట్)
నాలుగో T20: జనవరి 31 (పుణె)
ఐదో T20: ఫిబ్రవరి 02 (ముంబై)
భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్:
తొలి వన్డే: ఫిబ్రవరి 06 (నాగ్‌పూర్)
రెండో వన్డే: ఫిబ్రవరి 09 (కటక్)
మూడో వన్డే: ఫిబ్రవరి 12 (అహ్మదాబాద్)
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్:
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ - ఫిబ్రవరి 20న (దుబాయ్)
పాకిస్థాన్‌తో మ్యాచ్ - ఫిబ్రవరి 23న (దుబాయ్)
న్యూజిలాండ్‌తో మ్యాచ్ - మార్చి 2న (దుబాయ్)
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత IPL 2025 జరగనుంది. మార్చి 14 నుంచి మే 25 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఆ తర్వాత 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. జూన్ 20తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.
తొలి టెస్టు: జూన్ 20- 24 (లీడ్స్)
రెండో టెస్టు: జులై 2- 6 (బర్మింగ్ హోమ్)
మూడో టెస్టు: జులై 10- 14 (లార్డ్స్)
నాలుగో టెస్టు: జులై 23- 27 (మాంచెస్టర్)
ఐదో టెస్టు: జులై 31- ఆగస్టు 4 (కెన్నింగ్‌స్టన్ ఓవల్)