ఐపీఎల్ టీమ్స్‌ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు వీరే..?

frame ఐపీఎల్ టీమ్స్‌ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు వీరే..?

praveen

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పుడూ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంటాయి. 2024 ఐపీఎల్ చాలా రసవత్తరంగా నడిచింది. 2025 ఐపీఎల్ కూడా అంతకుమించి అనేలాగా ఫ్యాన్స్‌ను మెప్పించడానికి సిద్ధమయ్యింది. ఈ టోర్నమెంట్ కి సమయం చాలా దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో టీమ్స్ తమ జట్టులో ఎవరిని రిటైన్ చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రిటైన్ / రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీలు గరిష్ఠంగా ఆరుగురిని రిటైన్ చేసుకోవచ్చు. ఈ నెల 31లోపు ప్రతి జట్టు ఏయే ఆటగాళ్ళను అట్టిపెట్టుకుంటుందో వారి పేర్లతో సహా రిటైన్ లిస్ట్‌ వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు జట్టుతో ఉండొచ్చు అనే చర్చ జరుగుతోంది. క్రికెట్ వర్గాల ప్రకారం ఏయే టీమ్, ఎవరిని రిటైన్ చేసుకుంతుందో ఒక అవగాహన అయితే వచ్చింది. వారి ప్రకారం అన్‌అఫీషియల్ రిటైన్ లిస్ట్ ఏదో తెలుసుకుందాం.
* చెన్నై సూపర్ కింగ్స్ ఎం.ఎస్.ధోనీ, రవీంద్ర జడేజా రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె, మతీషా పతిరన, రచిన్ రవీంద్ర అంటే ఆరుగురు ప్లేయర్లను అంటి పెట్టుకోవచ్చు.
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దిగ్గజ బ్యాటర్‌ విరాట్ కోహ్లితో పాటు మహ్మద్ సిరాజ్, విల్ జాక్స్, కామెరూన్ గ్రీన్, యశ్ దయాళ్, మహిపాల్ లామ్రోర్ లను ఉంచుకోవచ్చు.
* కోల్‌కతా నైట్ రైడర్స్ ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, మిచెల్ స్టార్క్, రింగ్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రమణ్ దీప్ సింగ్/ హర్షిత్ రాణా లను రిటైన్ చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.
* గుజరాత్ టైటాన్స్ రిటైన్ లిస్టులో శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మహ్మద్ షమీ, సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా/ షారుఖ్ ఖాన్ ఉండొచ్చు.
* సన్ రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్, అబుల్ సమద్ లను రిటైన్ చేసుకోనుంది.
* లక్నో సూపర్ జెయింట్ నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిషోయ్‌, మొహ్‌సిన్ ఖాన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యలను రిటైన్ చేసుకోవచ్చు.
* రాజస్థాన్ రాయల్ రిటైన్ జాబితాలో సంజు శాంసన్‌, యశస్వి జైస్వాల్‌, రియాన్ పరాగ్‌, ట్రెంట్ బౌల్ట్ యుజ్వేంద్ర చాహల్‌, తనుష్ కొటియన్ ఉండవచ్చు.
* పంజాబ్ కింగ్ సామ్ కరన్, అర్షదీప్ సింగ్, కగిసో రబాడ, లియామ్ లివింగ్ స్టన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
* ముంబయి ఇండియన్స్‌ హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ, సూర్య కుమార్‌, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, అనుల్ కాంబోజ్/ నేహల్ వధేరా లను రిటైన్ చేయవచ్చు.
* ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌, జేక్ ఫ్రేజర్, మెక్‌గర్క్, ట్రిస్టన్‌ స్టబ్స్, మిచెల్ మార్ష్, అభిషేక్ పౌరెల్ వారిని జాబితాలో ఉంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: