RCBకి షాక్.. కర్ణాటక ప్లేయర్ల కోసం కాంగ్రెస్ ఒత్తిడి?

frame RCBకి షాక్.. కర్ణాటక ప్లేయర్ల కోసం కాంగ్రెస్ ఒత్తిడి?

Veldandi Saikiran
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కంటే ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టులో ప్రాంతీయవాదం తెరపైకి వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో.... కేవలం కర్ణాటక ఆటగాళ్లు మాత్రమే ఎక్కువగా ఉండాలని... ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉండకూడదని అక్కడి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
 ఐపీఎల్ రిటెన్షన్ లిస్టు  ఫైనల్ చేయడానికి అక్టోబర్ 31వ తేదీ వరకే ఛాన్స్ ఉంది. ఇలాంటి నేపథ్యం లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన క్రికెటర్ల ను... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు  యాజమాన్యం తీసుకోవాలని...  ఇతర రాష్ట్రాల ప్లేయర్లను వదిలేయాలని అక్కడి కాంగ్రెస్ సర్కార్ డిమాండ్ చేస్తోందట. ఈ లెక్క ప్రకారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన విజయ్ కుమార్ అలాగే మనోజ్ బండాగే ను కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలని.. డిమాండ్ చేస్తున్నారట.
 అటు కర్ణాటక ఆర్సిబి ప్లేయర్లు కూడా ఇదే వాదన వినిపిస్తున్నట్లు సమాచారం అందుతుంది. స్థానిక ఆటగాళ్ల కు ప్రాధాన్యత ఇస్తే భవిష్యత్తు బాగుంటుందని కూడా వారు డిమాండ్ చేస్తున్నారట. అయితే కర్ణాటక ప్లేయర్లను మాత్రమే తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందని... ఆర్ సి బి జట్టు భవిష్యత్తు మళ్లీ  అందాకారంలోకి వెళుతుందని యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 ఈసారి రిటన్షన్లో ఆర్సిబి జట్టు... విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, మ్యాక్సీ మామ, అలాగే గ్రీన్, రజత్  లను అంటి పెట్టుకోవాలని... చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లిస్టులో ఉన్న వారు ఎవరు కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కాదు. అందుకే కర్ణాటక రాష్ట్రా నికి చెందిన కనీసం..  ఇద్దరు ప్లేయర్ల నైనా తీసుకోవాలని... డిమాండ్ కొత్తగా తెరపైకి వస్తుంది. మరి దీని పై... నిర్ణయం తీసుకోవాలంటే అక్టోబర్ 31వ తేదీ లోపే తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

RCB

సంబంధిత వార్తలు: