శివాజీ ది బాస్ : కమర్షియల్ ఎలిమెంట్స్ తో సోషల్ మెసేజ్.. వింటేజ్ శంకర్ తీరే వేరబ్బా..!!

murali krishna
స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. భారీ సినిమాలకి పెట్టింది పేరు దర్శకుడు శంకర్.. శంకర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఆయన తెరకెక్కించే ప్రతీ సినిమాలో ప్రేక్షకులను ఎంతగానో అలరించే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన మెసేజ్ ను కూడా ఉంటుంది.. శంకర్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ తో వరుస భారీ సూపర్ హిట్స్ అందించిన ఘనత శంకర్ కే దక్కుతుంది.. సినిమాకు రిచ్ నెస్ పరిచయం చేసింది కూడా దర్శకుడు శంకరే.. సినిమాను ఎంత గ్రాండ్ గా, అద్భుతమైన విజువల్స్ తో  తెరకెక్కిస్తే ఆ సినిమాకు అంత వాల్యూ ఉంటుందని దర్శకుడు శంకర్ అప్పట్లోనే గ్రహించారు.. అద్భుతమైన గ్రాఫిక్స్, గ్రాండియర్ విజువల్స్ తో  శంకర్ సినిమా రీతినే మార్చేసారు.. అయితే శంకర్ తెరకెక్కించిన సినిమాలలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మొదటి సినిమా ‘శివాజీ ది బాస్’... ఈ సినిమా ఆయన కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైనది..

2007లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. శంకర్ నుంచి చివరిగా వచ్చిన సోషల్ మెసేజ్ మూవీ ఇదే. ఆ తరువాత నుంచి రోబో, ఐ అంటూ టెక్నికల్ సినిమాల వైపు ఆయన వెళ్లారు..ఇండియాలో ఉన్న బ్లాక్ మనీ, అది బయటకి వస్తే ఎంతమంది బ్రతుకులు బాగుపడతాయనేది.. కమర్షియల్ గా చూపించి శంకర్ అదుర్స్ అనిపించారు.ఈ సినిమాలో హాట్ బ్యూటీ శ్రియా హీరోయిన్ గా నటించింది.విలక్షణ నటుడు సుమన్ ఈ సినిమాలో విలన్ గా కనిపించాడు. అయితే ఈ సినిమా చివరిలో రజిని గుండు గెటప్ లో ఎంట్రీ ఇచ్చే సీన్ మాత్రం అదిరిపోతుంది.. ఆ గెటప్ లో అదిరిపోయే స్టైల్ తో డిఫరెంట్ మ్యానరిజమ్స్ తో రజని అదరగొట్టారు... ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. ముఖ్యంగా రజనీ ఎలివేషన్స్ కి రెహమాన్ ఇచ్చిన బిజీఎం అదిరిపోతుంది..సుమారు 90 కోట్ల బడ్జెట్ తో ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 160 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని రికార్డులు సృష్టించింది. అలాగే ఎన్నో అవార్డులు కూడా ఈ సినిమా అందుకుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: