కేటీఆర్‌ కేసులో ఇవాళ కీలక విచారణ.. వాళ్లిద్దరూ బుక్‌ అవుతారా?

Chakravarthi Kalyan
కేటీఆర్‌ ఇరుక్కున్న ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసులో ఇవాళ ఇద్దరు అధికారులు ఏసీబీ విచారణకు రాబోతున్నారు. ఇవాళ ఎసిబి విచారణకు ఐఏఎస్‌ ఆధికారి అర్వింద్ కుమార్ హాజరు కానున్నారు. విచారణకు హాజరవ్వాలని ఆయనకు గతంలోనే ఎసిబి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసులో ఏ2గా ఉన్న అరవింద్‌కుమార్.. నిధుల బదలాయింపులో కీలక పాత్ర పోషించినట్టు ఆధారాలు ఉన్నాయి. అర్వింద్ కుమార్ తన పరిధిలో ఉన్న హెచ్‌ఎండీఏ నుంచి ఎఫ్‌ఈవోకు నిధులు బదిలీ చేశారు.
హెచ్‌ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బీఎల్‌ఎన్‌రెడ్డి ద్వారా నిధులు బదలాయింపును అర్వింద్‌ కుమార్‌ పర్యవేక్షించారు. అయితే కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేశానని అర్వింద్ కుమార్ అంటున్నారు. ఈ మేరకు గతంతోనే ప్రభుత్వానికి అర్వింద్ వివరణ ఇచ్చారు. ఇవాళ అర్వింద్ కుమార్ స్టేట్మెంట్‌ను అధికారులు ట్ రికార్డు చేయనున్నారు. ఆయనతో పాటు హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ ను కూడా విచారించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: