ఐ : రొటీన్ రివెంజ్ డ్రామా కావడం వల్లే శంకర్ టార్గెట్ మిస్ అయ్యిందా..?

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో శంకర్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభించిన మొదట్లో అద్భుతమైన విజయాలను అందుకుంటూ వచ్చాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం శంకర్ ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనకబడిపోయాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం శంకర్ , విక్రమ్ హీరోగా ఆమీ జాక్సన్ హీరోయిన్గా "ఐ" అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు ప్రధాన కారణం ఈ మూవీ కి శంకర్ దర్శకత్వం వహించడం , ఈ మూవీ లో విక్రమ్ హీరో గా నటించడం , ఈ మూవీ కంటే ముందు శంకర్ , విక్రమ్ కాంబోలో అపరిచితుడు అనే మూవీ వచ్చి భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వీరి కాంబోలో వచ్చిన రెండవ సినిమా కావడంతో "ఐ" మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగినట్టు గానే ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేస్తున్న ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉండడంతో శంకర్ , విక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటుంది అని చాలా మంది భావించారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కథలో పెద్దగా బలం లేకపోవడం , రొటీన్ రివెంజ్ డ్రామా కావడంతో శంకర్ నుండి ఇలాంటి రొటీన్ రివెంజ్ కథతో సినిమా చేయడం ఏంటి. ఆయన సినిమాలో అద్భుతమైన కథ ఉంటుంది అనుకొని ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్న వారు ఈ సినిమా చూసి డిసప్పాయింట్ కావడంతో ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షోకే ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలోని విక్రమ్ నటనకు ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి శంకర్ కి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: