కేటీఆర్‌పై కేసు.. హరీశ్‌కు ఇదే మంచి టైమ్.. ఆ పని చేస్తారా?
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే కేటీఆర్.. ఆయన అరెస్టయితే.. ఇక పార్టీని ఎవరు నడిపిస్తారు.. కేసీఆర్ ఎన్నికలైన తర్వాత నుంచి బయటకే రావట్లేదు. ఆయన యాక్టివ్ రోడ్ ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. ఈ నేపథ్యంలో పార్టీని నడిపించే బాధ్యత హరీశ్‌రావే తీసుకోవాల్సి ఉంటుంది. హరీశ్ కూడా అందుకు సిద్ధమైనట్టే కనిపిస్తోంది. గతంలో తనను ఎంతగా అవమానించినా హరీశ్‌రావు ప్రస్తుతం బావకు అండగా నిలుస్తున్నారు.
కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటున్న హరీశ్‌రావు.. ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయమై న్యాయవాదులతో చర్చిస్తున్నామంటున్నారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టారని.. రైతు బంధు వానాకాలం సీజన్ కు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఎగ్గొట్టారని.. రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెడతారని మాకు తెలుసని.. ఎన్ని కేసులు పెట్టినా మేము ఎదుర్కొంటామని హరీశ్‌రావు అంటున్నారు.
బ్లాక్ మెయిల్ రాజకీయాలు, అక్రమ కేసులతో మమ్మల్ని నిలువరించవచ్చని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారన్న హరీశ్‌రావు.. విచారణకు కేటీఆర్ సహకరిస్తారని.. విచారణ చేసుకోవచ్చని కోర్టు చెప్పిందని అన్నారు. రేవంత్ రెడ్డి ఫార్ములా- ఈ రేసులో ఏడాది పాటు ఎందుకు కేసు పెట్టలేదన్న హరీశ్‌రావు.. ఎఫ్.ఈ.ఓ కంపెనీ ప్రతినిధులు సీఎం అయిన మూడో రోజు రేవంత్ రెడ్డిని కలిస్తే ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. మేము బయటపెట్టాక రేవంత్ రెడ్డి నిజం ఒప్పుకున్నారని.. కేటీఆర్ విచారణకు వెళ్తారు... కానీ ప్రభుత్వం లేనిది ఉన్నట్లు సృష్టిస్తోంది కాబట్టి మేము లాయర్లతో వెళ్తాము అన్నామని హరీశ్‌రావు అంటున్నారు.