ఏపీ: మాజీ సీఎం జగన్ కు హైకోర్టులో ఊరట.. 5 ఏళ్ల పొడిగింపు..!
ఈ పాస్ పోర్ట్ మంజూరు చేయాలి అంటే 20వేల రూపాయలు పూచికతతో పాటుగా వైయస్ జగన్ ప్రత్యక్షంగా హాజరు కావాలి అంటూ గతంలో కూడా కోర్టు ఉత్తర్వులను జారీ చేసిందట. ఈ క్రమంలోనే కోర్టు ఇచ్చిన తీర్పుని సైతం సవాల్ చేస్తూ నిన్నటి రోజున వైయస్ జగన్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు.. అయితే 20,000 పూచికతతో పాటు ప్రత్యేకంగా హాజరు కావాలనే విషయాన్ని హైకోర్టు కొట్టి వేసింది.దీంతో జగన్ కి కాస్త ఊరట కూడా లభించింది.
ఐదేళ్ల పాస్ పోర్ట్ నీ జారీకి నిరభ్యంతరంగా కూడా పత్రాన్ని ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలను జారీ చేసింది. గతంలో ఏడాది మాత్రమే రెన్యువల్ చేసేందుకు అంగీకరించిన..ఇప్పుడు తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును సైతం ఏపీ హైకోర్టు కొట్టి వేసినట్లుగా తెలియజేసింది. గత సెప్టెంబర్ లో కూడా విదేశాలకు వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి పాస్ పోర్ట్ రెన్యువల్ కోసం అభ్యర్థించగా ఈ విషయం పైన సిబిఐ కోర్టు ఎన్ఓసి తీసుకురావాలని అంటూ ఆదేశాలను జారీ చేశారట. అయితే ఈ సమయంలోనే జగన్ విజయవాడలో ప్రజాప్రతినిధుల ప్రత్యేకమైన కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విజయవాడ కోర్టు ఈ ఫిట్షన్ని కొట్టేసిందట. అప్పుడు ఏడాది మాత్రమే రెన్యువల్ కు అవకాశం ఇచ్చిందట.