రోబో 2.0 తో కొత్త ప్రయోగం..హాలీవుడ్ కు ఇండియా పవర్ ఏంటో చూపిన శంకర్ ?

Veldandi Saikiran
మన ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. కానీ కొంతమంది స్టార్ దర్శకులు... భారీ బడ్జెట్ సినిమాలు తీసి హిట్ అందుకుంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు తీసి.... సక్సెస్ అవుతున్నారు. అలా సక్సెస్ అయిన వారిలో దర్శకుడు శంకర్ కూడా ఉన్నారు. దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా చేశాడు. ఆయన చేసిన సినిమాలలో రోబో 2.0 ఒకటి.
 సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా... ఈ రోబో 2.0 తీశారు. ఈ సినిమాలో రజినీకాంత్ హీరోగా చేయగా అక్షయ్ కుమార్ విలన్ గా చేయడం జరిగింది. అలాగే ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించారు. బసవంగా రోబో సినిమా గతంలో వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ తరుణంలోనే రోబో 2.0 తీయాలని దర్శకుడు శంకర్ భావించారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 29 2018 సంవత్సరంలో ఈ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది.
 శంకర్ ఎక్కువగా లైకా ప్రొడక్షన్స్ వారితోనే సినిమాలు చేస్తూ ఉంటారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ ను వాడుతుంటారు. అయితే ఈ రోబో 2.0 సినిమాను... ఏకంగా 570 కోట్లు పెట్టి 2018లోనే తీయడం జరిగింది.  అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత.. రోబో సినిమా తరహాలో ఈ సినిమాకు కలెక్షన్లు రాలేదు. కాస్త తక్కువ కలెక్షన్స్ వచ్చినప్పటికీ... సినిమా మాత్రం బంపర్ హిట్ అయింది.
 రోబో 2.0 సినిమా మొత్తం 800 కోట్లు సంపాదించగలిగింది. ఇది గ్రాస్ కలెక్షన్ మాత్రమే. ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా 136.16 కోట్లు సంపాదించగలిగింది. ఇక ఫైనల్ కలెక్షన్స్ వచ్చేసరికి 655. 81 కోట్లు ఈ సినిమా రాబట్టగలిగింది.  అంటే వీళ్లు అనుకున్న దానికంటే కలెక్షన్స్ తక్కువగానే వచ్చింది. కానీ ప్రపంచవ్యాప్తంగా.... బాహుబలి 2 తర్వాత  ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇలా పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడు శంకర్ సక్సెస్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: