అందుకే ఆ పిచ్చి పని చేసా.. క్లారిటీ ఇచ్చిన రిషబ్ పంత్?
అదంతా పక్కన పెట్టి, అసలు విషయంలోకి వెళితే.. "ఇద్దరు ఒకే ప్లేస్‌లో ఫీల్డింగ్ ఎందుకు చేస్తున్నారు? మిడ్ వికెట్‌లో ఎవరూ లేరు కదా? ఒకరు అక్కడ ఫీల్డింగ్ చేస్తే బావుంటుంది!" అని బంగ్లాదేశ్ ఫీల్డర్లకు రిషబ్ పంత్ సూచించగా పంత్ మాటలు విన్న బంగ్లా కెప్టెన్ షాంటో.. ఒక ఫీల్డర్‌ను మిడ్ వికెట్‌లో ఉంచడం జరిగింది. కాగా పంత్ మాట్లాడిన ఆయా మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అవ్వడంతో అవ్వగా.. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే రిషబ్ పైన కొన్ని విమర్శలు వచ్చాయి. కాగా మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ ఫీల్డింగ్ సెట్ చేయడానికి కారణం ఏంటో వివరణ ఇచ్చాడు పంత్.
ఈ సందర్భంగా ఆయన క్లారిటీ ఇస్తూ... క్వాలిటీ క్రికెట్ కోసమే తాను ఫీల్డ్ అలా సెట్ చేశానని చెప్పుకొచ్చాడు. టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా మాటలు తనను ప్రభావితం చేశాయని, అందుకే అలా ఆలోచించానని అన్నాడు. "ఆఫ్ ద ఫీల్డ్‌లో నేను అజయ్ జడేజాతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. ఆటలో ఇంకా క్వాలిటీ పెంచాలని నాతో అంటూ ఉంటాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా క్వాలిటీ క్రికెట్ మాత్రమే ఆడాలని, మరేమీ ఆలోచించకూడదు అని చెబుతుంటాడు. బంగ్లాపై నేను బ్యాటింగ్ చేసేటప్పుడు మిడ్ వికెట్‌లో ఎవరూ లేరు. ఒకే ప్లేస్‌లో ఇద్దరు ఫీల్డింగ్ చేస్తున్నారు. అందుకే నేను ఒక ఫీల్డర్‌ను మిడ్ వికెట్‌వైపు వెళ్లమని చెప్పాను. అజయ్ జడేజా మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. దాని వలన ఎవరికీ సమస్య రాలేదు అనుకుంటా!" అని రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు.