పంత్ ఫ్యాన్స్ కి ఇది పండుగ లాంటి న్యూస్.. ఇంతకీ ఏంటంటే?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా కూడా 2025 ఐపీఎల్ సీజన్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఐపిఎల్ సీజన్ ప్రారంభానికి ముందు మెగా వేలం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మెగా వేలంలో ఇక ఐపీఎల్ లోని 10 ఫ్రాంచైజీలు ఎలాంటి నిర్ణయాలతో అభిమానులకు షాకులు ఇవ్వబోతున్నాయ్ అనే విషయం పైన చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొన్ని టీమ్స్ ఏకంగా కెప్టెన్లను కూడా వదులుకునేందుకు సిద్ధమయ్యాయి అన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది.

 ఇక మరికొన్ని టీమ్స్ కేవలం పరిమిత ఆప్షన్లు మాత్రమే ఉండడంతో ఎవరిని రిటైన్ చేసుకొని ఎవరిని వేలంలోకి వదిలేయబోతున్నాయి అనే విషయంపై కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే గత కొంతకాలం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుతంగా రాణించడం విషయంలో కీలకపాత్ర వహించిన కోచ్ రికీ పాంటింగ్ ఆ జట్టు యాజమాన్యం వదిలేసుకుంది. అయితే మరి రిషబ్ పంత్ విషయంలో ఆ జట్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే విషయంపై కూడా అభిమానుల్లో అనుమానాలు ఉన్నాయి.

  ఒకవేళ రిటెన్షన్ ప్రక్రియ మొదలైతే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదట రిటైన్ చేసుకోబోయేది రిషబ్ పంత్ నే అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇక ఇప్పుడు అనుకున్నదే జరిగింది. మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ను తొలి రిటెన్షన్ గా దక్కించుకోబోతుందని సమాచారం. ఇప్పటికే దీనిపై పంత్ కు ఆ ఫ్రాంచైజీ  సమాచారం కూడా అందించింది. రిటెన్షన్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తే మొదటి ఆప్షన్ గా పంత్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక మరో నాలుగు ఆప్షన్లు కుల్దీప్ యాదవ్, అక్షర పటేల్, జేక్ ప్రెషర్, స్టబ్స్ ను అటు ఢిల్లీ క్యాపిటల్స్ అంటి పెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: