పాక్ జట్టు కోసం.. ఎవరో ఒకరు రావాలి : మాజీ
అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఎన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ.. పరిస్థితిలో మాత్రం అస్సలు మార్పు రావడం లేదు అన్న విషయం తెలిసిందే. ఏకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ దగ్గర నుంచి కోచ్ లు కెప్టెన్ లు ఇలా అందరినీ మారుస్తూ వస్తూనే ఉంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయినప్పటికీ ఇక జట్టు ఆట తీరు మాత్రం మారడం లేదు అని చెప్పాలి. ఈ ఏడాది జరిగిన వరల్డ్కప్ లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్.. మొన్నటికి మొన్న సొంత గడ్డపై బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ లో దారుణ ఓటమి చవిచూసి క్లీన్ స్వీప్ అయింది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే అటు పాకిస్తాన్ క్రికెట్ మరింత ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. అయితే ఇదే విషయం గురించి ఆ దేశ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ అంపశయ్య మీద ఉంది అంటూ చెప్పుకువచ్చాడు. జట్టును గాడిలో పెట్టే వ్యక్తులు ఇప్పుడు ఎంతో అత్యవసరం అంటూ వ్యాఖ్యానించాడు. కెప్టెన్ బాబర్ అజాం మానసిక ఒత్తిడికి గురై ఆటలో రాణించలేకపోతున్నాడు. ఆయన కెప్టెన్సీ వదిలేసి బ్యాటింగ్ పై దృష్టి సారించాలి అంటూ సూచించాడు. సొంత గడ్డపై జరిగిన టెస్టులో తొలిసారి బంగ్లాదేశ్ చేతులో పాకిస్తాన్ క్లీన్ స్వీప్ కి గురి కావడం ఆ జట్టు దుస్థితికి అద్దం పడుతుంది అంటూ రషీద్ లతీఫ్ అన్నాడు.