యశస్వి జైస్వాల్ నూ ఊరిస్తున్న.. కోహ్లీ, రోహిత్ లకు సాధ్యం కానీ రికార్డ్?

praveen
యశస్వి జైస్వాల్.. గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో కాస్త గట్టిగా వినిపిస్తున్న పేరు. అంతర్జాతీయ క్రికెట్ లోకి కొత్తగా అడుగుపెట్టిన ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ అదరగొడుతూ ఉండగా.. తాను మాత్రం అందరికీ మించిన ప్లేయర్ని అన్న విషయాన్ని అతి తక్కువ మ్యాచ్లతోనే నిరూపించుకున్నాడు. అప్పటికే  దేశవాలి క్రికెట్ లో సెంచరీల మోత మోగించిన ఈ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన తర్వాత కూడా అదే తీరు ఆటతో అందరూ చూపులు తన వైపుకు తిప్పుకుంటున్నడు.

 దీంతో ఈ యంగ్ ప్లేయర్ క్రీజులో కుదురుకున్నాడు అంటే చాలు ఏకంగా స్కోరు బోర్డుకు సైతం ఆయాసం వచ్చేలా బ్యాటింగ్ విధ్వంసాన్ని సృష్టించగలడు అని ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు అని చెప్పాలి. అయితే కేవలం పరిమితం ఓవర్ల  ఫార్మాట్లో మాత్రమే కాదు సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో సైతం టీ20 తరహా ఇన్నింగ్స్ లు ఆడుతూ ఇక వరల్డ్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు ఈ క్రికెటర్. ఆచితూచి ఆడాల్సిన టెస్ట్ ఫార్మాట్లలో సిక్సర్ల మోత మోగిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే.. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన యశస్వి జైస్వాల్ ను ఇప్పుడు మరో ఆల్ టైం రికార్డ్ ఊరిస్తుంది . టెస్ట్ ఫార్మాట్ లో మరో 7 సిక్సర్లు కొడితే.. ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సర్లు  కొట్టిన ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టిస్తాడు. ఈ ఏడాది జైశ్వాల్  టీమ్ ఇండియా తరపున టెస్టుల్లో 26 సిక్సర్లు బాదాడు. అయితే ఒక క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ టెస్ట్ సిక్సర్లు బాదిన క్రికెటర్గా బ్రాండమ్ మేకల్లమ్  33 సిక్సర్లతో టాప్ లో ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్లో జైస్వాల్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు వరకు కోహ్లీ రోహిత్ లకు సైతం ఈ రికార్డు సాధ్యం కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: