ఐపీఎల్ 2025 : సూర్య కుమార్ కు రూ.100 కోట్లు?

frame ఐపీఎల్ 2025 : సూర్య కుమార్ కు రూ.100 కోట్లు?

praveen
టీమిండియాలో స్టార్ బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ కు ఇటీవల అదిరిపోయే ప్రమోషన్ వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా టి20 ఫార్మాట్ కు రెగ్యులర్ కెప్టెన్గా ఎంపిక అయ్యాడు. అయితే ఇలా రెగ్యులర్ కెప్టెన్ గా అతని ఎంట్రీ కూడా అద్భుతంగా సాగింది. శ్రీలంక పర్యటనలో భాగంగా జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ ను కెప్టెన్గా సూర్య 3-0 తేడాతో టీమిండియా కు అందించి సిరీస్  దక్కించుకున్నాడు.

 అయితే ఈ టి20 సిరీస్ లో బ్యాటర్ గా తన మార్కు చూపించాడు. బౌలర్ గాను కొత్త అవతారం ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక కెప్టెన్సీ తో అయితే ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. టి20 వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా ను అద్భుతమైన క్యాచ్ తో దెబ్బకొట్టిన సూర్య ఇక తను రెగ్యులర్ కెప్టెన్ గా బరులోకి దిగిన మొదటి సిరీస్ తోనే తనది మాస్టర్ మైండ్ అని అందరి చేత అనిపించుకున్నాడు  30 బంతుల్లో 30 పరుగులు ఉన్న సమయంలో టీమిండియా కు ఓటమి తప్పదు అనుకున్న సమయంలో ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకొని ప్రత్యర్థులను అయోమయంలో పడేసాడు. ఇలా సూర్య కుమార్ యాదవ్ తనలో గొప్ప కెప్టెన్ మాత్రమే కాదు గొప్ప ఆల్ రౌండర్ కూడా ఉన్నాడు అన్న విషయం నిరూపించుకున్నాడు.

 దీంతో ఇక టీమిండియా కెప్టెన్  గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్  2025 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు నుంచి బయటికి వచ్చి వేలంలో పాల్గొంటాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా  కొనసాగుతున్న అతనిని దక్కించుకునేందుకు ఎన్నో ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడతాయని.. క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే అతనికి భారీ ధర పలికే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. ఇక సూర్య కుమార్ యాదవ్ కు ఉన్న టాలెంట్ కి 100 కోట్లు పెట్టిన తక్కువే అని ఫ్రాంచైజీలు అనుకుంటున్నాయట. ఏం జరగబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: