ఈ గణాంకాలు చూసి కూడా.. సంజూకి ఇంకా ఛాన్సులు వస్తాయా?
అతను ఎవరో కాదు సంజూ శాంసన్. ఇండియన్ క్రికెట్లో మోస్ట్ అన్ లక్కీ క్రికెటర్ ఎవరు అంటే ముందుగా ఇతని పేరు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మిగతా యువ ఆటగాళ్లతో పోల్చి చూస్తే ఇతను భారత జట్టులోకి అరంగేట్రం చేసి ఏళ్ళు గడుస్తున్నాయి. కానీ ఇప్పటివరకు పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు దక్కించుకోలేదు. అయితే ఇలా భారత జట్టులోకి వచ్చినప్పుడు ఒకటి రెండు మ్యాచ్లలో బాగా రాణించిన.. ఆ తర్వాత మాత్రం నిలకడలేమిటో ఇక జట్టులో చోటు కోల్పోతూ ఉంటాడు. అయితే ఇక ఇటీవల శ్రీలంక పర్యటనలో భాగంగా టి20 సిరీస్ కు ఎంపికైనప్పటికీ అతనికి మళ్ళీ అడపా దడప అవకాశాలే దక్కాయి.
దీంతో సంజు విషయంలో సెలెక్టర్లు వివక్ష చూపిస్తున్నారు అంటూ ఎంతో మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇక కొన్ని గణాంకాలు చూపుతూ ఇలాంటి గణాంకాలు చూసి కూడా సంజుకి జట్టులో చోటు ఇవ్వడం కరెక్టేనంటారా అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు ఆడిన సంజూ 19.30 సగటుతో 131.36 స్ట్రైక్ రేటుతో రెండు ఆప్ సెంచరీలు కలుపుకొని 444 పరుగులు మాత్రమే చేశాడు. గత ఏడాది నుంచి ఆడిన మ్యాచ్లలో 50 ప్లస్ పరుగులు చేసింది ఒకే ఒక్కసారి మాత్రమే. ఇక మిగతా మ్యాచ్లో 5, 12, 7, 13, 1, 40, 12 ఇలా పరుగులు చేస్తూ వచ్చాడు. ఇక ఇటీవలే అటు శ్రీలంకతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ లలో కూడా డకౌట్ అయ్యాడు. దీంతో ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో ఉన్న పోటీ దృశ్యం ఇలాంటి గణాంకాలు ఉన్న సంజూకి ఎంతవరకు జట్టులో చోటుకల్పించడం బెటర్ అనే చర్చ కూడా జరుగుతుంది.