అవకాశాలన్నీ ఆ కుర్రాడివే: ఇర్ఫాన్ పఠాన్

praveen

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తమదైన పదునైన ముందు చూపుతో భారత టీమ్ ని దూసుకు పోయేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంక పర్యటనలో వరుసగా 2 మ్యాచ్‌లు గెలిచి తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 3 టీ20ల సిరీస్‌ను 2-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పుకొని తీరాలి. ఇకపోతే ఈ ఆదివారం జరిగిన రెండో టీ20లో డక్ వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కారణంగా ఈ మ్యాచ్‌లో భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కూడా భారత బ్యాటర్లు 6.3 ఓవర్లలోనే 81 పరుగులు చేసి విజయాన్ని సునాయాసంగా అందుకున్నారు.
అదలా ఉంచితే... ఈ మ్యాచ్‌కు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడనొప్పితో దూరం కావడం చేత అతని స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రావడం జరిగింది. అయితే ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేక సతమతం అయిపోయాడు. ఈ క్రమంలో ఏకంగా గోల్డెన్ డక్‌గా అవుట్ అయ్యి పెవిలియన్ చేరాడు. దాంతో సంజూ శాంసన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసినదే. ఎంతలా అంటే... ఇపుడు సంజూ శాంసన్‌ను సొంత అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా తప్పు బట్టడం గమనార్హం.
ఇక ఇలాంటి తరుణంలో... ఇర్ఫాన్ పఠాన్ తనదైన రీతిలో కామెంట్స్ చేసాడు. కాగా ఆ వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. విషయం ఏమిటంటే... సంజూ శాంసన్ కంటే రియాన్ పరాగ్‌కే ఎక్కువ అవకాశాలు దక్కుతాయని జోస్యం చెప్పడం. అవును, ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లలో బౌలింగ్ చేసే సామర్థ్యం ఎవరికి లేకపోవడం అనే అంశం రియాన్ పరాగ్‌కు కలిసొచ్చే అంశమని తన అభిప్రాయం వ్యక్తం చేసాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ కంటే రియాన్ పరాగ్‌కు అవకాశం ఇవ్వడమే సరైన నిర్ణయమని తేల్చి చెప్పేసాడు.. ఆ సంగతిని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు. సోషల్ మీడియాలో భాగంగా ఇర్ఫాన్ పఠాన్... 'టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లలో బౌలింగ్ చేసే మొనగాడే లేడు. దాంతో బౌలింగ్ సామర్థ్యం ఉన్న రియాన్ పరాగ్‌కు అవకాశం ఇవ్వడం మేలు. ఇది రియాన్ పరాగ్‌కు ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ అవుతుంది. అతన్ని జట్టులో కొనసాగించడమే... సరైన నిర్ణయం' అని పఠాన్ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: