అయినా.. ఆటకు కోచ్ తో సంబంధం ఏముంది.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్?
ఇక మొన్నటికి మొన్న రాహుల్ ద్రవిడ్ కోచింగ్ లోనే అటు టి20 వరల్డ్ కప్ కూడా గెలుచుకుని దాదాపు పొట్టి ఫార్మాట్లో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించి టైటిల్ గెలుచుకుంది అన్న విషయం తెలిసిందే. అద్భుతమైన పోరాట ప్రతిభతో అందరిని ఆకట్టుకుంది. అయితే ఇక ఇప్పుడు భారత జట్టుకు కొత్త కోచ్ గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలోనే గంభీర్ ఇలా టీమిండియా హెడ్ కోచ్ గా ఎంత మేరకు ఆటగాళ్లను సరైన దారిలో నడిపించగలడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇదే విషయం గురించి టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆటకు కోచ్ తో సంబంధం ఉండదు అంటూ వ్యాఖ్యానించాడు మంజ్రేకర్. కోచ్ లేకపోయినప్పటికీ 1983లో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచింది. 2007లో లాల్చంద్, 2011లో గ్యారీ కెరీస్టన్, 2023లో ద్రావిడ్ కోచ్గా ఉన్నారు. ఇలా కోచ్ ఎవరు అనేదానికన్నా టీం ఎలా ఆడింది అన్న విషయమే ముఖ్యం. ఆటకు కోచ్ తో సంబంధం ఉంటుంది అనుకోవడం ఇప్పటికైనా మానాలి అంటూ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. అయితే ఢిల్లీ ప్లేయర్ గంభీర్ కోచ్గా రావడం ముంబై చూడలేకపోతోంది అంటూ సంజయ్ మంజ్రేకర్ పై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి.