WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?

Veldandi Saikiran
ప్రస్తుతం టీమిండియా... శ్రీలంక టూర్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ లో ఫైనల్ కు చేరాలంటే టీమిండియా కొన్ని మ్యాచ్లు గెలవాల్సి ఉంది. దానికి సంబంధించిన... వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మూడో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్... జూన్ మాసంలో జరగనుంది. అలాగే ఈ మ్యాచ్ కు ఇంగ్లాండ్లోని లార్డ్స్... ఆతిథ్యం ఇవ్వబోతుందని సమాచారం.

ఇప్పటికే జరిగిన రెండు ఎడిషన్ లలో టీమిండి యా జట్టు ఫైనల్ కు వెళ్లి... బొక్క బోర్లా పడింది.  మొన్న టి ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడింది.  ఈసారి మూడోసారి కూడా ఫైనల్ కు వెళ్లాలని టీమిండియా ఆత్రుతగా ఉంది. అయితే ఈ ఛాంపియన్స్ షిప్ ఫైనల్ లో చేరాలంటే... టీమిండియా తదుపరి మూడు సిరీస్లలో రెండు ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.


అయితే తదుపరి మూడు సిరీస్లలో టీమిండియా కు ప్రత్యర్ధులుగా ఆస్ట్రేలియా, న్యూజి లాండ్ మరియు బంగ్లా దేశ్ లు ఉన్నాయి.  బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా.  అలాగే న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ ను ఆడనుంది టీమిండియా జట్టు. ఇక ఫైనల్ గా బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా... ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య 5 టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి.

బంగ్లాదేశ్ అలాగే న్యూజిలాండ్ తో ఖచ్చితంగా టీమిండియా గెలిచే ఛాన్సులు ఉంటాయి. అయితేఆస్ట్రేలియా జట్టుతో మాత్రం టీమిండియా కు పెద్ద సవాల్ గా మారింది. ఆ జట్టు పై గెలవాలంటే చాలా కసితో ఆడాలి. కాబట్టి బంగ్లాదేశ్ అలాగే న్యూజిలాండ్తో... సిరీస్ గెలిచి.. ఆస్ట్రేలియాపై టఫ్ ఫైట్ ఇవ్వాలి. అప్పుడే టీమిండియా ఫైనల్ కు వెళుతుంది. మరి వరల్డ్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కోసం టీం ఇండియా ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: