ప్చ్.. ఇలా జరిగిందేంటి.. సంజుపై సెలెక్టర్లు పగబట్టారా?

praveen
ఇండియన్ క్రికెట్లో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది యువ ఆటగాళ్ళు దేశవాళి క్రికెట్ సహా ఐపీఎల్ లాంటి టోర్నీలలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అదరగొడుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా తమ ప్రతిభను నిరూపించుకున్న ఆటగాళ్లకు సెలక్టర్లు కూడా ఇక మంచి అవకాశాలను కల్పిస్తున్నారు. మొన్నటికి మొన్న ఐపిఎల్ లో బాగా రాణించిన ఆటగాళ్లు అందరికీ కూడా తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలో ఛాన్స్ కల్పించారు భారత సెలక్టర్లు. ఇటీవల జింబాబ్వే పర్యటనకు టీమిండియా వెళ్లిన సమయంలో ఎంతో మంది కొత్త ఆటగాళ్లు భారత టీమ్ లోకి అరంగేట్రం చేశారు అన్న విషయం తెలిసిందే.

 ఇలా ప్రతిభగల యువ ఆటగాళ్లందరూ కూడా టీమ్ ఇండియాలో లక్కీ ఛాన్స్ దక్కించుకుంటున్నారు. దీంతో బీసీసీఐ సెలెక్టర్లు ఎప్పుడు ప్రతిభకు పెద్దపీట వేస్తూ ఉంటారు అని అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. కానీ ఒక్క ఆటగాడు విషయంలో మాత్రం బీసీసీఐ సెలెక్టర్లు ఎప్పుడు వివక్షపూరితంగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకంటే అతనిలో ఎంతో ప్రతిభ ఉన్న ఇక అతనికి ప్రతిసారి జట్టు సెలక్షన్ విషయంలో మొండి చేయి ఎదురవుతూనే ఉంటుంది. అతను ఎవరో కాదు సంజు శాంసన్. మొన్నటికి ముందు ఐపీఎల్లో రాణించిన ఆటగాళ్ళు అందరికీ మంచి ఛాన్స్ లు దక్కితే కెప్టెన్ గా ఆటగాడిగా బాగా రానించిన సంజుకి మాత్రం పెద్దగా ఛాన్సులు రాలేదు.

 దీంతో ప్రతిసారి లాగే ఈసారి కూడా టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు అన్యాయం జరిగింది. దీంతో ఫాన్స్ బిసిసిఐ సెలెక్టెర్ లపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకతో టి20 సిరీస్ కు అవకాశం ఇచ్చిన సెలెక్టర్లు వన్డేలకు మాత్రం మొండి చేయి చూపించారు. భారత్ తరపున చివరిసారిగా దక్షిణాఫ్రికా తో ఆడిన వన్ డే సంజు శాంసన్ సెన్సరీ చేశాడు. అయినప్పటికీ అతన్ని బీసీసీఐ జట్టు ఎంపికలు పరిగణలోకి తీసుకోలేదు. దూబే లేదా రియాన్ పరాగ్ ఇద్దరిలో ఎవరో ఒకరి స్థానంలో సంజూ శాంసన్ కి ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని పలువురు మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: