టీమ్ ఇండియాలో వాళ్లే.. నా ఫేవరెట్ ప్లేయర్స్ : గిల్
సీనియర్లను కాదని ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా శుభమన్ గిల్ ను బరిలోకి దింపేంతల అతని ప్రతిభ తో సెలెక్టర్లను సైతం ప్రభావితం చేశాడు. ఈ క్రమం లోనే ప్రస్తుతం అతనే ఫ్యూచర్ స్టార్ కాబోతున్నాడు అంటూ అందరి లో నమ్మకాన్ని కూడా కలిగించాడు శుభమన్ గిల్. అయితే ఇక ఇప్పుడు భారత జట్టు జింబాబ్వే పర్యటన లో ఉండగా ఇక గిల్ ఒక అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఏకంగా టీమిండియాను కెప్టెన్గా ముందుకు నడిపించే ఛాన్స్ ను దక్కించుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమం లోనే గిల్ కెప్టెన్సీ లో యంగ్ టీమ్ ఇండియా నేటి నుంచి అటు జింబాబ్వేతో టి20 సిరీస్ ప్రారంభించబోతోంది.
అయితే ఎంత స్టార్ క్రికెటర్ అయినప్పటికీ తమకంటూ ప్రత్యేకంగా ఒక ఫేవరెట్ ప్లేయర్ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియా లో తన ఫేవరెట్ ప్లేయర్లు ఎవరు అన్న విషయాన్ని గిల్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తన ఫేవరెట్ ప్లేయర్లు అంటూ తెలిపాడు గిల్. భారత క్రికెట్ లో వారిద్దరూ లెజెండ్స్ అంటూ కొనియాడాడు. వారు సాధించిన ఘనతలను అందుకోవడం కష్టం తో కూడుకున్నది అంటూ ఇటీవలే మీడియా సమావేశం లో చెప్పుకొచ్చాడు. ఒత్తిడిని జయిస్తేనే ఇది సాధ్యమవుతుంది అంటూ గిల్ కామెంట్స్ చేశాడు.