టీ20 వరల్డ్ కప్ : గెలుపు తర్వాత మట్టిని తిన్న రోహిత్ శర్మ.. ఎందుకో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని రోజుల క్రితం "ఐసిసి టి20 మెన్స్ వరల్డ్ కప్ 2024" సీజన్ ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ ప్రారంభం కాకముందే భారత అభిమానులు కచ్చితంగా ఈ సారి భారత జట్టు టీ 20 వరల్డ్ కప్ ప్రోఫీనీ ఎగరేసుకేలుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ వస్తోంది. నిన్న భారత్ మరియు దక్షిణాఫ్రిక మధ్య టీ 20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదటగా టాస్ గెలిచి భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు మొదట్లోనే కొన్ని వికెట్లు కోల్పోవడంతో రన్ రేట్ కాస్త తగ్గింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఆప్ సెంచరీ తో జట్టుకు మంచి జోష్ ను నింపాడు. దానితో 20 ఓవర్లు పూర్తి అయ్యేసరికి భారత జట్టు మొదటగా బ్యాటింగ్ చేసి 177 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రిక మొదటి 15 ఓవర్లు అద్భుతమైన పర్ఫామెన్స్ ను కనబరిచి ఆల్మోస్ట్ గెలిచింది అనే స్థాయికి వెళ్ళింది. కానీ ఆ తర్వాత 5 ఓవర్లు ఇండియా తన అద్భుతమైన బౌలింగ్ తో దక్షిణాఫ్రికను కట్టు దిట్టం చేసి వారికి చుక్కలు చూపించారు.

దానితో "ఐసిసి టి20 మెన్స్ వరల్డ్ కప్ 2024" లో ఇండియా విజేతగా నిలిచింది. ఇక ప్రస్తుతం భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయన నేతృత్వంలో ఇండియాకు టీ20 వరల్డ్ కప్ రావడంతో ఆయన ఎంతో ఆనందపడ్డారు. ఇకపోతే దక్షిణాఫ్రికతో మ్యాచ్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ పిచ్ పైకి వచ్చే రెండు సార్లు చిటికెడు మట్టిని తిన్నారు. ఈ విజయం ఎప్పటికీ గుర్తుండి పోవాలని , తన శరీరంలో ఇమిడిపోవాలని రోహిత్ శర్మ ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సీజన్లో భారత జట్టు 8 మ్యాచ్ లు ఆడగా 8 మ్యాచ్ లలో కూడా గెలుపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: