రన్స్ 0, వికెట్స్ 0, క్యాచ్ లు 0.. జట్టుకు భారంగా మారుతున్న టీమిండియా క్రికెటర్?

praveen
ప్రస్తుతం జరుగుతున్న t20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా టీమ్ ఇండియా టైటిల్ గెలవాలి అనే పట్టుదలతో బరిలోకి దిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన టీమిండియా మూడింటిలో కూడా విజయం సాధించింది. ఈ క్రమంలోనే సూపర్ 8 కి కూడా అర్హత సాధించింది అని చెప్పాలి. సూపర్ 8 లో భాగంగా అటు ఆస్ట్రేలియాతో తలబడేందుకు సిద్ధం అవుతుంది.

 అయితే టీమిండియా ఇలా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నప్పటికీ ఎందుకో కొంత మంది ఆట తీరు మాత్రం అటు భారత జట్టు అభిమానులు అందరిని కూడా ఆందోళనలో పడేస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే టి20 వరల్డ్ కప్ లో అద్భుతంగా రానించి జట్టు విజయాలలో కీలకపాత్ర వహిస్తారు అనుకున్న ఆటగాళ్లు.. చెత్త ప్రదర్శన చేసి నిరాశ పరుస్తూ ఉన్నారు. అయితే ఇలా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో కూడా దారుణంగా విఫలమైన ఆటగాళ్లలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఒకరు. అతను జట్టులో ఎంత కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 అయితే ఈ టి20 వరల్డ్ కప్ లో మాత్రం ఈ సీనియర్ ఆల్ రౌండర్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇప్పుడు వరకు మూడు మ్యాచ్లు అతను ఆడగా గణాంకాలు రన్స్ సున్న, వికెట్లు 0, క్యాచ్లు సున్నా అన్న విధంగా పేలవంగా సాగుతుంది. ఒక మ్యాచ్లో బ్యాటింగ్ కి వచ్చి డక్ అవుట్ అయ్యాడు. గత మ్యాచ్ లో బౌలింగ్ వేయలేదు. దీంతో అతని స్థానంలో తీసుకోవాలని అతను బ్యాటింగ్లో అయినా జట్టుకు ఉపయోగపడతాడని డిమాండ్లు వినిపిస్తున్నాయి. యశస్వి జైష్వాల్ జట్టులోకి వస్తే మంచి ఓపెనింగ్ ఇస్తాడని దీంతో విరాట్ కోహ్లీ వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఉంటుందని అప్పుడు టీమిండియా బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారిపోతుందని అభిప్రాయపడుతున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: