చంద్రబాబు విషయంలో జగన్ ప్లాన్ ఇదేనా.. టీడీపీపై విమర్శలు చేసే ఛాన్స్ లేనట్టేనా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వైసీపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. వైసీపీ సైతం టీడీపీ విమర్శలకు కౌంటర్లు ఇస్తోందే తప్ప డైరెక్ట్ గా ఎక్కువ విమర్శలు చేయడం లేదు. జగన్ తన పోస్ట్ లలో  ఈవీఎంలలో మోసాలు జరిగి ఉండొచ్చని చెప్పారే తప్ప టీడీపీని ఎక్కడా టార్గెట్ చేసి విమర్శలు చేయలేదు. జగన్ మరో మూడేళ్లు ఇదే రూట్ ఫాలో కానున్నారని తెలుస్తోంది.
 
కూటమిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చిన తర్వాత జగన్ ప్రజల్లోకి వెళ్లేలా పొలిటికల్ కెరీర్ ను ప్లాన్ చేసుకోనున్నారని సమాచారం అందుతోంది. మానిఫెస్టో వల్లే ఓడిపోయానని భావిస్తున్న జగన్ 2029 ఎన్నికల సమయానికి సరికొత్త హామీలతో ప్రజల ముందుకు రానున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రజలకు సైతం సమయం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం వైసీపీకి పెద్దగా అనుకూల పరిస్థితులు అయితే లేవనే సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు ఏం కామెంట్ చేసినా నెటిజన్ల నుంచి, ఏపీ ప్రజల నుంచి నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఆ వ్యతిరేకతను తగ్గించుకునే దిశగా వైసీపీ అడుగులు వేయాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చేసిన తప్పుల విషయంలో వైసీపీ జాగ్రత్త వహించాల్సి ఉంది.
 
వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న నేతలెవరూ ఈ మధ్య కాలంలో నోరు మెదపడం లేదనే సంగతి తెలిసిందే. టీడీపీ విమర్శలకు బదులిచ్చినా ఒకింత జాగ్రత్తగానే రియాక్ట్ అవుతున్నారు. కూటమి నేతలు కక్ష సాధింపులకు దూరంగా ఉంటే మంచిదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో ఓటమిపాలు కావడం మాజీ సీఎం  జగన్ వ్యాపారాలపై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: