కాంగ్రెస్ : జగిత్యాల ఎమ్మెల్యే యూటర్న్.. మళ్లీ గులాబీ గూటికి ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు జగిత్యాల చుట్టూ తిరుగుతున్నాయి. గత మూడు రోజులుగా.. రెండు తెలుగు రాష్ట్రాలలో జగిత్యాల కాంగ్రెస్ పంచాయతీ వైరల్ గా మారింది. చెప్పా పెట్టకుండా... గులాబీ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్... కాంగ్రెస్ పార్టీలో చేరడం... ఇప్పుడు వివాదంగా మారింది. దాదాపు 25 సంవత్సరాలుగా జగిత్యాల నియోజకవర్గం లో కీలక రాజకీయ నాయకులుగా ఉన్న... జీవన్ రెడ్డికి చెప్పకుండానే... డాక్టర్ సంజయ్ కుమార్ ను... కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.

గడిచిన  10 సంవత్సరాలలో... జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా డాక్టర్ సంజయ్ కుమార్  పనిచేశారు.  గులాబీ పార్టీలో ఉండి... కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు కూడా పెట్టించారు సంజయ్. అయితే సంజయ్ కుమార్ కు జీవన్ రెడ్డి 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాంటి చోట... రేవంత్ రెడ్డి పెద్ద మిస్టేక్ చేశారు. జీవన్ రెడ్డికి కూడా... చెప్పకుండా... ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రత్యర్థిని కాంగ్రెస్లో చేర్చుకున్నారు.

దీంతో అధిష్టానం పైన అలిగిన జీవన్ రెడ్డి... పార్టీని వీడ్తానని.. రెండు రోజులుగా రచ్చ చేస్తున్నారు. సీనియర్ నాయకులు కావడంతో... గులాబీ అలాగే బిజెపి పార్టీల నుంచి ఆయనకు ఆఫర్లు వస్తున్నాయి. ఇక చేసేదేమీ లేక కాంగ్రెస్ అధిష్టానం కూడా... రంగంలోకి దిగి... జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ సందర్భంగా... గులాబీ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోకూడదని... సోనియాగాంధీ ముందు తన డిమాండ్ పెట్టారట జీవన్ రెడ్డి.

ఇప్పుడు చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడాబయటికి వెళ్లాల్సిందేనని... అలా అయితేనే పార్టీలో ఉంటానని జీవన్ రెడ్డి... మొండి పట్టు పట్టారట. ఇక.. జీవన్ రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో... గులాబీ పార్టీ కార్యకర్తలు... సంజయ్ కుమార్ ను వదిలేసారు. అటు కాంగ్రెస్  కార్యకర్తలు అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో చేసేది ఏమీ లేక... మళ్లీ కేసీఆర్ పార్టీలో చేరాలని... సంజయ్ కుమార్ అనుకుంటున్నారట. తప్పుచేసి కాంగ్రెస్లో చేరానని... ఇప్పుడు రియలైజ్ అవుతున్నారట జగిత్యాల ఎమ్మెల్యే.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: