సూపర్ ఫీచర్లతో తక్కువ ధరకే నోకియా నుంచి ఫీచర్ ఫోన్లు?

రిలయన్స్ జియో 4జీ వేరియంట్ లో స్మార్ట్ ఫోన్ కి దీటుగా కీప్యాడ్ ఫోన్లను లాంచ్ చేసింది.సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు అదే ట్రెండ్ ను హెచ్ఎండీ గ్లోబల్ ఆధ్వర్యంలోని నోకియా కూడా మొదలు పెట్టింది. ఇప్పటికే ఉన్న మోడళ్లకు తోడు రెండు కొత్త 4జీ ఫీచర్ ఫోన్లను కూడా లాంచ్ చేసింది. హెచ్ఎండీ నోకియా 220 4జీ ఇంకా నోకియా 235 4జీ పేర్లతో కొత్త ఫీచర్ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్‌లు క్లాసిక్ స్నేక్ గేమ్, యూట్యూబ్ షార్ట్ యాప్ ఇంకా అలాగే సులభ లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ద్వారా ప్రీలోడ్ చేసిన యూపీఐ చెల్లింపులు చేసుకునేలాగా తీసుకొచ్చింది. దీనిక సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


నోకియా 235 4జీ మొత్తం మూడు రంగులలో వస్తుంది. నీలం, నలుపు, ఊదా రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీని రేటు రూ. 3,749. నోకియా 220 4జీ ఫోన్ పీచ్, బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో కూడా లభిస్తుంది. దీని రేటు రూ.3,249. రెండు ఫోన్లని కూడా హెచ్ఎండీ.కామ్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్, నోకియా రిటైల్ అవుట్‌లెట్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.


ఇక నోకియా 235 4జీ ఫీచర్ ఫోన్ 2.8-అంగుళాల డిస్ ప్లే, 2ఎంపీ వెనుక కెమెరాతో వస్తుంది. ఇంకా అలాగే ఇది యూనీసోక్ టీ107 ప్రాసెసర్, ఎస్30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 64ఎంబీ ర్యామ్, 128ఎంబీ స్టోరేజ్ తో వస్తుంది. దీనిని మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 32జీబీ దాకా విస్తరించవచ్చు. 
ఇది 1450ఎంఏహెచ్ తొలగించగల బ్యాటరీతో వస్తుంది. మొత్తం 9.8 గంటల మాట్లాడే సమయాన్ని అందిస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లలో ఛార్జింగ్ కోసం యూఎస్బీ-సీ టైప్, బ్లూటూత్ వీ5.0 ఇంకా 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఎఫ్ఎం రేడియో, క్లౌడ్ యాప్‌లు ఉన్నాయి. వాతావరణ అప్‌డేట్‌లు, ఎంపీ3 ప్లేయర్, క్లాసిక్ స్నేక్ గేమ్, యూట్యూబ్ షార్ట్‌లు ఇంకా స్కాన్ చేసి యూపీఐ చెల్లింపు యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.


అలాగే నోకియా 220 4జీ ఫీచర్ ఫోన్ కూడా 2.8-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. యూనిసోక్ టీ107 ప్రాసెసర్ ఇంకా ఎస్30ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సులభమైన లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ద్వారా ప్రీలోడ్ చేసి, ఆమోదించబడిన యూపీఐ అప్లికేషన్‌లకు ఇది సపోర్ట్ ఇస్తుంది. 2ఎంపీ వెనుక కెమెరా తప్ప, నోకియా 235 4జీ మోడల్‌లో ఉన్న అన్ని ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి. ఈ ఫోన్ క్లాసిక్ స్నేక్ గేమ్‌తో కూడా వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: