ఈ బ్యూటీలకు ఏజ్ పెరిగిన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు... ఇప్పటికీ అదే స్థాయిలో ఆఫర్స్..?

MADDIBOINA AJAY KUMAR
సినీ పరిశ్రమలో హీరోలకు ఉన్నంత లైఫ్ హీరోయిన్లకు ఉండదు. దానితోనే ఎక్కువ శాతం మంది హీరోయిన్లు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే అనేక సినిమాలను చేయడానికి ఆశపడుతూ ఉంటారు. అందులో భాగంగా కొంతమంది స్టోరీ సెలక్షన్లో తప్పులు చేయడం వల్ల మంచి క్రేజ్ మొదట నటించిన సినిమాల ద్వారా వచ్చిన ఆ తర్వాత అపజయాలను అందుకొని అవకాశాలు తగ్గడంతో కనుమరుగైపోతూ ఉంటారు. ఇక మరి కొంత మంది ముద్దుగుమ్మలు మాత్రం  కెరీర్ మొదట్లోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటూ, ఆ తర్వాత కూడా తొందరపడి ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు చేయకుండా సెలెక్టివ్ గా మూవీలు చేస్తూ వెళుతూ ఉంటారు. దానితో వారు నటించిన సినిమాలలో చాలా సినిమాలు విజయం సాధిస్తూ ఉండడంతో వారి కెరియర్ కూడా చాలా సంవత్సరాలు ముందుకు సాగుతూ ఉంటుంది. ఇలా అత్యంత ఎక్కువగా కాలం కెరియర్ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలు ఎవరో తెలుసుకుందాం.
అందాల ముద్దుగుమ్మ సమంత చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇప్పటికీ కూడా ఈమెకు వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. ఇక చాలా సంవత్సరాల క్రితమే త్రిష సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. సీనియర్ స్టార్ హీరోల పక్కన మాత్రమే కాకుండా ఆ తర్వాత తరం హీరోల పక్కన కూడా నటించింది. ఇప్పటికీ కూడా ఈమె వరుసగా సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఇక చాలా సంవత్సరాల పాటు కెరియర్ను ఫుల్ జోష్ లో సాగిస్తున్న ముద్దుగుమ్మలలో నయనతార ఒకరు. ఈమె ఎప్పుడూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చింది. ఇప్పటికి కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తోంది. కాజల్ అగర్వాల్ కూడా చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన లక్ష్మీ కళ్యాణం మూవీ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ కూడా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. ఈ ముద్దు గుమ్మలు హీరోలతో సరి సమానంగా కెరీర్ను కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: