జగన్ కొంపముంచిన తప్పులు.. అవి రిపీట్ కాకుండా చంద్రబాబు ప్రణాళిక..?

Pulgam Srinivas
ఏ రాష్ట్రంలో అయినా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సమయంలో ఆ సమయంలో అధికారంలో ఉన్న పార్టీకి ఘోర పరాజయం ఎదుర్కొన్నట్లు అయితే ఆ పార్టీ కచ్చితంగా చాలా మిస్టేక్స్ చేసి ఉండాలి. లేనట్లయితే మరి ఘోరమైన ఓటమి దక్కదు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ అధికారంలో ఉంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి పార్టీకి ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి.

వీరికి ప్రజలు గొప్ప విజయాన్ని అందించి అధికారంలోకి తీసుకువచ్చారు. 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. దీనితోనే అర్థం అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ పార్టీపై ఏ స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు అనేది. ఇక వీరు అమలు చేసిన కొన్ని పథకాల ద్వారానే ప్రజల్లో వీరిపై నెగెటివిటీ పెరిగింది , అందుకే వీరికి ఈ స్థాయి ఓటమి దక్కింది అని చాలా మంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు.

ఇక ఎన్నికల తర్వాత తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానితో గత ప్రభుత్వం చేసిన ఏ తప్పులు కూడా పునరావృతం కాకుండా అత్యంత జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఒక వాలంటీర్ అతని పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి ఏ అవసరాలు ఉన్న వాటిని తీరుస్తూ ఉండాలి.

ఇలా చేయడం ద్వారా ప్రజలకు పార్టీ ఎమ్మెల్యేలతో , ఎంపీలతో , కార్యకర్తలతో సంబంధాలు పూర్తిగా తగ్గిపోయాయి.  
ఇది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏర్పడ్డ పెద్ద ప్రమాదం. దీనిని గ్రహించిన చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ప్రజల దగ్గరికి నేతలు , కార్యకర్తలు వెళ్లి సమస్యలను తెలుసుకునే విధానంపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే గత ప్రభుత్వం చేసిన అనేక తప్పులు మళ్లీ జరగకుండా ఆచితూచి ప్రణాళిక ప్రకారం చంద్రబాబు ముందుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: