ఇప్పుడు సినిమాల్లో అవి ఉంటేనే హిట్టు.. కల్కి విజయంలోనూ అవే కీలకం..??

Suma Kallamadi

ఒక మూవీ సక్సెస్‌ను కచ్చితంగా అంచనా వేయడం ఎవరి తరం కాదు. కొన్ని సమయాల్లో అనుభవం ఉన్న సినిమా దర్శకులు, హీరోల అంచనాలు నిజం కావచ్చు కానీ అన్ని సమయాల్లో నిజం కావు అందుకే ఎవరు కూడా 100% సక్సెస్ సాధించలేరు. ఒక సినిమా హిట్టవ్వడానికి లేదా ఫ్లాప్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ప్రేక్షకుల నాడిని పట్టుకొని, సినిమాలో అన్నీ వర్గాలను ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. 

అయితే ఈ మధ్య కాలంలో ఒక పాట లేదా ఒక్క సన్నివేశం, ఒక ఫైట్.. ఇలా సింగిల్ ఎలిమెంట్ మాత్రమే ఒక మూవీ సక్సెస్ను నిర్ణయిస్తోంది. ఉదాహరణకి బలగం సినిమాలో వచ్చిన లాస్ట్ పాట కారణంగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాంతారావు సినిమాలో కూడా కారణంగా వరాహ రూపం పాట కారణంగా అది సూపర్ హిట్ అయింది. ఇలా సినిమాలో ఏదో ఒక గూస్‌బంప్స్ తెప్పించే పార్ట్ ఉంటే చాలు.. ప్రేక్షకులు దానిని హిట్ చేస్తున్నారు. 

 టాలీవుడ్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్' కూడా అలాగే హిట్ అయింది. నిజానికి ఈ సినిమా అంతా బాగుంటుంది. అయితే క్లైమాక్స్‌లో వచ్చే గూస్‌బంప్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటాయి. అందుకే ఈ మూవీ 40 కోట్లు పెట్టి తీస్తే 350 కోట్లు వసూలు చేసింది. క్లైమాక్స్ లో తేజ సజ్జాకి ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. అదే ఈ మూవీకి హైలెట్ సీన్‌. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సీను బాగా ఎమోషనల్ గా, గూస్‌బంప్స్ తెప్పించేలా మలిచాడు.

ఇక గత నెల చివరిలో విడుదలైన 'కల్కి 2898 AD' సినిమాలో కూడా ఇలాంటి గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ 600 కోట్లు వసూలు చేసింది. హిందూ పురాణాలు, సైన్స్, ఫాంటసీ వంటి ఎలిమెంట్స్ అన్ని మిక్స్ చేసి తెరకెక్కించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. 

 ఈ మూవీ విడుదలైన తొలి రోజు ఫస్టాఫ్ డల్ గా ఉందని, బోరింగ్ గా ఉన్నట్లు నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. ప్రభాస్ ఇల్లు కూడా బాగోలేదని చాలామంది అన్నారు. ఇక ఈ సినిమా కూడా ఫ్లాపే అని చాలామంది అనుకున్నారు కానీ సెకండాఫ్ చూశాక మూవీ బాగుందని చాలామంది కామెంట్ చేయడం ప్రారంభించారు. లాస్ట్ 30 మినిట్స్‌ ప్రభాస్‌ పాత్రలో అదిరిపోయే ట్విస్ట్‌ రావడం వల్ల ఈ మూవీ బోరింగ్ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గా మారిపోయింది.

బౌంటీ హంటర్‌గా ఉన్న ప్రభాస్‌.. "కల్కీ" క్లైమాక్స్‌లో మాత్రం మహాభారతంలోని కర్ణుడిలా కనిపించి థియేటర్లలో ఈలలు వేయించాడు. 'ఆలస్యమైందా ఆచార్య పుత్రా' అనే ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పడంతో థియేటర్ దద్దరిల్లింది. కురుక్షేత్రంలో ప్రభాస్‌ కర్ణుడి లాగా పోరాడాడు. విల్లు ఎక్కుపెట్టి రథం మీద నిల్చోని గూస్ బంప్స్ తెప్పించాడు. కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్ గా కనిపించి అతను కూడా స్క్రీన్ పై మంటలు పుట్టించాడు. ఈ అంశాలే 'కల్కి' పార్ట్-2 కోసం అందరూ వెయిట్ చేసేలా చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: