నేడు రేవంత్‌-బాబు మీటింగ్‌....తెరపైకి టీటీడీ వాటా.. ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో... సీఎం రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు హైదరాబాదులో భేటీ అవుతారు. ప్రగతి భవన్ లో... రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు సమావేశం జరగనుంది.

ఈ సందర్భంగా... రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న  10 సంవత్సరాల పెండింగ్ సమస్యలు , వివాదాలపై  చర్చించనున్నారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ముఖ్యంగా ఈ సమావేశంలో... కొత్త అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కలుపబడ్డ 7 మండలాలు తిరిగి తెలంగాణలో చేర్చాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అలాగే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000కి.మీ మేర విస్తారమైన తీరప్రాంతం (Coastal Corridor) ఉన్న సంగతి తెలిసిందే.

అయితే..  తెలంగాణకు ఈ తీరప్రాంతంలో భాగం కావాలని సీఎం రేవంత్‌ కోరే ఛాన్స్‌ ఉందట. ముఖ్యంగా తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వేంకటేశ్వరస్వామి అన్న సంగతి తెలిసిందే. తెలంగాణకు కూడా టీ.టీ.డీ.లో భాగం కావాలని కోరే ఛాన్సు ఉందని చెబుతున్నారు. అటు కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉన్న విషయం తెలిసిందే. అయితే...  అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్ మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలని ఇద్దరూ సీఎం చర్చించుకునే ఛాన్స్‌ ఉంది. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీ నీటిని కేటాయింపు చేయాలని కోరే ఛాన్స్‌ లేకపోలేదు.

తెలంగాణ విద్యుత్ సంస్థలకు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు రూ.24,000 కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలని కోరే అవకాశలు ఉన్నాయి. దానిలో భాగంగా ఆంధ్రాకు ఏమైనా చెల్లించాల్సి ఉంటే, వాటిని చెల్లించడం జరుగుతుందని చర్చించే ఛాన్సు ఉంది. అటు తెలంగాణకు ఓడరేవులు లేవు. అందువల్ల విభజనలో భాగంగా ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్ట్స్ లో భాగం కావాలని రేవంత్‌ అడిగే ఛాన్స్‌ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: