జగన్ కుటుంబ కథా చిత్రం: రాజన్న బిడ్డల మధ్య వారసత్వ పోరు..!

Divya
•వైయస్ బిడ్డల మధ్య వారసత్వ పోరు

•అండగా నిలిచిన చెల్లెలే శత్రువు అయ్యిందా

•వారసత్వ పోరులో నెగ్గేదెవరు..

(ఆంధ్ర ప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం.. వైయస్ఆర్ పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు..  అదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ ఆయన కూతురు షర్మిల.. వైయస్ వారసుడైన జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు.. కొన్ని అక్రమ కేసుల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డిని అప్పటి ప్రభుత్వం ఇరికించి జైలులో ఉంచితే.. అటు తల్లికి ఇటు అన్నయ్యకి అండగా వీరి చెల్లెలు షర్మిల పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేసింది. ఇక ఈమె పడిన కష్టం వల్లే జగన్మోహన్ రెడ్డి పై ప్రజల్లో సానుభూతి కలిగి 2019 ఎన్నికల్లో అఖండ విజయంతో గెలుపొందేలా తోడ్పడింది.
అయితే ఇప్పుడు అదే చెల్లెలు జగన్ ఓటమికి కారణమయ్యింది.. దీన్ని బట్టి చూస్తే రాజన్న బిడ్డల మధ్య వారసత్వ పోరు మొదలైందని స్పష్టంగా తెలుస్తోంది.. ముఖ్యంగా జగన్ తన చెల్లెలి పైన విమర్శించక పోయినా షర్మిల మాత్రం తన అన్నయ్యని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్లో కలిసి టీడీపీతో కుమ్మక్కయిందని వార్తలు కూడా వినిపించాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన కారకుడని.. ఇలాంటి వ్యక్తిని చెంతకు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అంటూ అన్నయ్యని కూడా చూడకుండా ఈమె పెద్ద ఎత్తున విమర్శించింది. ఇక చెల్లెలు శాపం తగిలే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా నేడు మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు.. వైయస్సార్ వారసత్వం పై ప్రస్తుతం అన్నా చెల్లెల మధ్య రాజకీయ రచ్చ మొదలైన నేపథ్యంలో తండ్రి జయంతిని ఘనంగా నిర్వహించడానికి రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి.  ఇప్పటి వరకు షర్మిల,  జగన్ ఎవరికి వారు ఇడుపులపాయ వెళ్లి తండ్రికి నివాళులు అర్పించేవారు.. కానీ ఇప్పుడు మొదటిసారి వైయస్ జయంతిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది షర్మిల.. మరోవైపు ఓటమి నైరాశ్యం లో ఉన్న వైసీపీ కూడా ఈ విషయంలో తగ్గేది లేదు అంటుంది.

ఇకపోతే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగయింది. ఈ క్రమంలోని రాష్ట్ర కమిటీ పగ్గాలను వైయస్ షర్మిల చేపట్టగా..  దీంతో పార్టీ శ్రేణుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి .. ఎన్నికల్లో కూడా ఈ పార్టీకి దారుణమైన ఓటమి ఎదురైంది.. అయితే గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగింది. కానీ సీట్లు  రాలేదు.. అయినా వెనుకడుగు వేయకుండా 2029 ఎన్నికల్లో ఎలాగైనా సరే కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తుంది షర్మిల.  అందుకు వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది.. ఇప్పటిదాకా వైఎస్ వారసత్వాన్ని ఆయన ద్వారా వచ్చిన ఓటు బ్యాంకును కాపాడుకున్న జగన్ కి కూడా ఈమె గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు. నిజానికి ఇద్దరూ వైయస్ వారోసులే .. కష్టాల్లో ఉన్న అన్నకు అండగా నిలబడ్డం కోసం వచ్చిన షర్మిల... వైఎస్ఆర్సిపి విజయం కోసం పాటుపడింది.. ఇప్పుడు ఎదురు తిరుగుతోంది. మరి వారసత్వ మధ్య పోరు ఎంతటికి దారితీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: