టాలీవుడ్ లో విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాష్ రాజ్..దేశం గర్వించదగ్గ నటులలో ఆయన ఒకరు.. విలన్ గా, సహాయ నటుడుగా, హీరోగా ఇలా పాత్ర ఏదైనా ప్రకాష్ రాజ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పిస్తాడు..ఒక్క తెలుగులోనే కాదు ప్రతి ఇండస్ట్రీ లో ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు..అందుకే ఆయన కేవలం ఒక ఇండస్ట్రీ కి చెందిన వాడు కాదు, దేశం లో ఉన్న అన్ని భాషలకు సంబంధించిన నటుడు అని అందరూ అనుకుంటూ ఉంటారు..ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటనకు ఎన్నో పురస్కారాలు లభించాయి. నేషనల్ అవార్డుని సైతం అందుకున్న అతి తక్కువ మంది నటులలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. ఇప్పటికీ కూడా అంతే డిమాండ్ తో ప్రకాష్ రాజ్ పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాడు..అయితే నటుడుగా గొప్ప పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలలో నిలుస్తూ వుంటారు.. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్టాయిలో భారీ విజయం సాధించింది..భారీగా కలెక్షన్స్ రాబట్టింది.. దేవర సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంతో తాజాగా మేకర్స్ ఒక సక్సెస్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ లో ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి..
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కొరటాల శివ కథ, దాని మీద ఎన్టీఆర్ పెట్టుకున్న నమ్మకం. ఎన్టీఆర్ అంటే నాకు ఎంతో ఇష్టం ఆస్కార్ అవార్డ్స్ వేడుక లో ఎంతోమంది దిగ్గజ నటుల మధ్య ఎన్టీఆర్ నిలబడి మాట్లాడుతుంటే నాకు ఎంతో గర్వంగా అనిపించింది.ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్నటువంటి స్టార్ హీరోలలో నాకు బాగా ఇష్టమైన హీరో ఎన్టీఆర్ మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే గతంలో ఎన్టీఆర్ కి, ప్రకాష్ రాజ్ మధ్య గొడవలు ఉండేవి అని ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉండేది. అందుకు కారణం మెగాస్టార్ ఇంద్ర 175 రోజుల వేడుక లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ‘ఈమధ్య కొంతమంది హీరోలు ఒకటి రెండు హిట్లు కొట్టగానే అన్నయ్య తర్వాత మేమే అని అంటున్నారు. వాళ్లకు ఒక్కటే చెప్తున్నా, చిరంజీవి గారు ట్యూబ్ లైట్ అయితే, మీరంతా ఆ ట్యూబ్ లైట్ చుట్టూ తిరిగే పురుగులు లాంటోళ్ళు. ఆయనతో మీకు పోలికా అంటూ సంచలన కామెంట్స్ చేసాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి అనినవే అని చాలా మంది భావించారు.. గతంలో ఎన్టీఆర్ ని విమర్శించిన ప్రకాష్ రాజ్ సడన్ గా ఎన్టీఆర్ నా ఫేవరెట్ యాక్టర్ అనడంతో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు..