సినిమాలపై సంచలన నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్..?

FARMANULLA SHAIK
ఎన్నికలకు ముందు ఓ లెక్క.. ఎన్నికల తరువాత మరోలెక్క.. గెలవకు ముందు ఓ లెక్క.. గెలిచిన తరువాత మరోలెక్క. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆయన మాటతీరుతో అందరినోటా శెభాష్ అనిపిస్తున్నారు. గతంలో ఆవేశంతో ప్రసంగించే పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఆలోచనతో అందర్నీ అవాక్కు అయ్యేట్టు చేస్తున్నారు. ప్రతి విషయాన్ని చాలా ఆలోచించి మాట్లాడుతున్నారు. విజయగర్వాన్ని నెత్తికి ఎక్కించుకోకుండా.. చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారు. నేటి సభలో ఆయన జనసైనికులకు చురకలేసిన తీరుకి ప్రశంసనీయంగా మారింది.పవన్ కళ్యాణ్ అనే నేనూ అంటూ అసెంబ్లీలో ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్.. నేడు పిఠాపురంలో మరోసారి డిప్యూటీ సీఎం హోదాలో ‘పవన్ కళ్యాణ్ అనే నేను’ అంటూ ప్రమాణం చేశారు. తనని బంపర్ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంలో.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న OG మూవీ అప్డేట్‌తో పాటు తన తదుపరి చిత్రాల షూటింగ్‌పై కూడా క్లారిటీ ఇచ్చేశారు.డిప్యూటీ సీఎంగా కీలక శాఖలకు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్.. భవిష్యత్‌లో సినిమాలు చేస్తారా లేదా అనేదానిపై చాలా అనుమానాలు ఉన్న నేపథ్యంలో వాటన్నింటిపైనా వివరణ ఇచ్చారు.ఆయన మాట్లాడుతుండగా.. ఆయన అభిమానులు OG.. OG అంటూ అరిచారు. దాంతో పవన్ కళ్యాణ్ తన అప్ కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చారు.ఎన్నికయ్యాక కనీస పనులు చేయకుండా ఓజీ షూటింగ్‍కు వెళితే.. క్యాజీ (ఏంటండి) అంటారనే భయపడుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. మూడు నెలలు పనులను చక్కబెట్టి.. ఆ తర్వాత వీలైనప్పుడు షూటింగ్‍లకు వెళతానని ఆయన చెప్పారు. సినిమాల కంటే ప్రజాసేవకే ఎక్కువ ప్రాధాన్యత అనేలా ఆయన స్పష్టం చేశారు.ఓజీ గురించి చెప్పాలని అభిమానులు గట్టిగా అరిచారు.

దీంతో పవన్ కల్యాణ్ నవ్వుతూ స్పందించారు. “సినిమాలు చేసే టైమ్ ఉందంటారా?” అంటూ వారిని ప్రశ్నించారు. ఎలాగూ మాట ఇచ్చాం కాబట్టి అంటూ పెండింగ్‍లో ఉన్న సినిమాలు పూర్తి చేస్తాననేలా చెప్పారు. “ముందు ఒక మూడు నెలలు.. కనీసం రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని మీరు తిట్టకూడదు కదా. కనీసం గ్రామాలకు కొత్త రోడ్ల కంటే ముందు గుంతలు పూడ్చాలి. మేం ఎన్నుకుంటే నువ్వు మళ్లీ ఓజీ చేస్తావా అని క్యాజీ అంటే నేనేం చెప్పను. మళ్లీ మీరు తిట్టకూడదు కదా. మా నిర్మాతలకు కూడా చెప్పా. కొంచెం క్షమించాలి. మా ఆంధ్ర రాజ్య ప్రజలకు మేం కొంత సేవ చేసుకొని.. ఎక్కడా పనికి అంతరాయం రాకుండా కుదిరినప్పుడల్లా రెండు రోజులో, మూడురోజులో షూటింగ్ చేస్తానని అని చెప్పా” అని పవన్ కల్యాణ్ అన్నారు.ఓజీ సినిమా గురించి అలానే అరుస్తుంటే మంచి జోష్ వచ్చే కామెంట్ చేశారు పవన్ కల్యాణ్. “ఓజీ చూద్దురు కానీ బాగుంటది” అని అన్నారు.పవన్ కల్యాణ్ లైనప్‍లో హరిహర వీరమల్లు చిత్రం ఉంది. నాలుగేళ్లుగా ఈ మూవీ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ మూవీ నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకోగా.. ఇప్పుడు జ్యోతి కృష్ణ ఆ బాధ్యతలు తీసుకున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా పవన్ కల్యాణ్ చేయాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: