షాకిస్తున్న కల్కి ఓవర్సీస్ వసూళ్లు?

Purushottham Vinay

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 371 కోట్ల షేర్, 742 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఇక అమెరికాలో కల్కి రిలీజ్ ముందు నుంచే సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.ఇప్పటి వరకు కల్కి సినిమా అమెరికాలో ఏకంగా 14.6 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది.  అంటే దాదాపు మన లెక్కల్లో 116 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో అయితే ఫస్ట్ నుంచి కూడా దుమ్ము దులిపేసింది. అక్కడ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కి పిచ్చ ఫిదా అవుతున్నారు. అందుకే బాలీవుడ్ లో ఇప్పటిదాకా ఏకంగా రూ.165 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా . 


ఓవర్ సీస్ లో కల్కి సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ సినిమా ఓవర్ సీస్ లో ఇప్పటికే 21 మిలియన్ డాలర్స్ రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ సినిమా దాదాపు 175 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది.చాలా వేగంగా ఈ సినిమా 1000 కోట్ల వైపు దూసుకుపోతుంది.600 కోట్ల భారీ బడ్జెట్ తో కల్కి 2898 ఏడి సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మించాడు.ఈ సినిమా రెండో భాగం కూడా రూపొందుతోందని, అందులో 60 శాతం పూర్తయిందన్న వార్త కూడా వినిపిస్తోంది. రెండో భాగంలో కొన్ని ముఖ్యమైన సీన్లను మాత్రం ఇంకా పూర్తిచేయాల్సి ఉందంటున్నారు. చాలా వరకు పూర్తయిపోయందనే అంటున్నారు.కల్కి పార్ట్ 2 ఇంకా చాలా ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: