ఎన్టీఆర్ వాళ్ల విషయంలో అంత ఎమోషన్ ఎందుకయ్యాడు... ఆ మాటల అర్థం ఏంటి...!
అయితే ఈ వేడుకకు సైతం ముఖ్య అతిథులుగా కేవలం ఎన్టీఆర్, కొరటాల శివ, అనిరుద్, రాజమౌళి ,కళ్యాణ్ రామ్, ప్రకాష్ రాజ్ ,దిల్ రాజు తదితర నటీనటులు మాత్రమే హాజరయ్యారట. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మొదట ఈ సంతోషాన్ని అట్టహాసంగా అభిమానులు అందరితో జరుపుకోవాలని చూసాము దేవీ నవరాత్రులు ఉండడం చేత సెక్యూరిటీ విషయంలో దృష్టి పెట్టుకొని పర్మిషన్ ఇవ్వలేదని.. పోలీసుల నిర్ణయాలను మనం గౌరవం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు చేసే డ్యూటీ మన కోసమే అంటూ తెలియజేశారు.
అందుకే ఇలా చిన్నగా ఈ ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది అంటూ చిత్ర బృందంతో పాటు డిస్ట్రిబ్యూటర్లతో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నామంటూ ఎన్టీఆర్ వెల్లడించారు.. అలాగే ఈ సినిమా ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకు అభిమానులకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానంటూ ఎమోషనల్ గా మాట్లాడారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ ఇలా మాట్లాడడానికి ముఖ్య కారణం.. గత కొంతకాలంగా ఎన్టీఆర్ పైన చాలామంది విషయం చిమ్ముతూ ట్రోల్స్ చేయడం కూడా జరిగింది.. మరి కొంతమంది మేము లేకపోతే అసలు ఎన్టీఆర్ సినిమా కలెక్షన్స్ రావని విధంగా ఒక వర్గం వారు మాట్లాడారు.. ఆ విషయాలన్నీ ఇప్పుడు గుర్తుకు వచ్చి.. కదా కంటెంట్ బాగుంటే సినిమాని ప్రేక్షకులే ఆదరిస్తారనే విధంగా మరొకసారి నిరూపించారని అందుకే ఇలా ఎమోషనల్ గా మాట్లాడారని ఆ మాటలకు అర్థం అదే అన్నట్లుగా పలువురు నెటిజెన్స్ తెలియజేస్తున్నారు.