మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించిన మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. చిరుత మూవీతో ఈయన వెండి తెరకు పరిచయం అయ్యాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ , ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మగధీర అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాకు అప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఖర్చు చేయనంత డబ్బును ఖర్చు చేసి ఈ మూవీ ని అత్యంత భారీగా నిర్మించారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఏకంగా అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
మగధీర ఇండస్ట్రీ హిట్ అయిన తర్వాత రామ్ చరణ్ తన కెరియర్ లో మూడవ సినిమాగా ఆరెంజ్ మూవీలో నటించాడు. ఈ మూవీలో జెనీలియా హీరోయిన్గా నటించగా ... బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక చరణ్ నటించిన మొదటి సినిమా మంచి విజయం సాధించడం , రెండవ సినిమా ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఆయన నటించిన మూడవ సినిమా అయినటువంటి ఆరెంజ్ మూవీ పై మొదటి నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు , మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది.
దానితో ఈ సినిమా ఏ మాత్రం ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించలేకపోయింది. అలా మగధీర తో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ను అందుకున్న తర్వాత చరణ్ కు ఆరెంజ్ మూవీతో భారీ ఎదురుదెబ్బ బాక్స్ ఆఫీస్ దగ్గర తగిలింది. ఈ మూవీ ని చరణ్ బాబాయ్ అయినటువంటి నాగేంద్రబాబు నిర్మించాడు. ఈ సినిమా ద్వారా ఈయన కూడా భారీగా అప్పుల్లో కోరుకుపోయాడు. ఇలా ఆరెంజ్ మూవీ చరణ్ కెరియర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది.