రేవంత్ రివర్స్ ఎటాక్..నాగార్జునపై పోలీస్ కేసు ?
ఈ తరుణంలోనే సమంత అలాగే అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకున్నారని కూడా ఆమె బాంబు పేల్చడం జరిగింది. అయితే ఈ వివాదం చల్లారక ముందే అక్కినేని నాగార్జునకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సినీ హీరో అక్కినేని నాగార్జున పై పోలీసు కంప్లైంట్ చేశారు. అయితే కొండా సురేఖ విషయంలో ఈ కేసు పెట్టలేదు. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణం పైన... తాజాగా పోలీస్ కేసు నమోదు అయింది.
తమ్ముడి కుంట లో కొంత స్థలానికి కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించాలని అక్కినేని నాగార్జున పై ఫిర్యాదు చేశారు. జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో అక్కినేని నాగార్జున పైన జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.అయితే అక్కినేని నాగార్జున పై పోలీస్ కేసు నమోదు కావడం పట్ల... తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
ఇదంతా రేవంత్ రెడ్డి సర్కార్ చేయిస్తోందని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి చేత రేవంత్ రెడ్డి నే స్వయంగా కేసు వేయించారని గులాబీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. కొండ సురేఖ పైన 100 కోట్ల పరువు నష్టం దావా నాగార్జున వేసిన సందర్భంగా... దాని డైవర్ట్ చేసేందుకు ఇప్పుడు అక్కినేని నాగార్జునను ఇరికిస్తున్నారని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఎన్ కన్వెన్షన్ ను ఇప్పటికే హైడ్రాధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ కట్టడాన్ని కూల్చివేశారు.