ఇండియా వ్యాప్తంగా అత్యంత ప్రజాధరణ పొందిన రియాలిటీ గేమ్ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఇకపోతే హిందీలో మొదటగా ఈ షో ప్రారంభం అయింది. దానికి ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కింది. దానితో బిగ్ బాస్ షో ను ఇండియాలోని అనేక ప్రాంతీయ భాషలలో కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా చాలా సంవత్సరాల క్రితమే తెలుగు లో కూడా బిగ్ బాస్ షో ను మొదలు పెట్టారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఎన్టీఆర్ తన అద్భుతమైన హోస్టింగ్ తో ఈ షో కు సూపర్ క్రేజ్ ను తీసుకువచ్చాడు.
ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ వ్యవహరించినందుకుగాను ఒక్కో వారానికి అదిరిపోయే రేంజ్ లో పారితోషకాన్ని పుచ్చుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా వ్యవహరించిన సమయంలో ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా 35 లక్షల వరకు పారితోషకాన్ని పుచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ మొత్తం బుల్లి తెరపై ఏడు సీజన్లు విజయవంతంగా కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ ప్రసారం అవుతుంది.
ఒక ఓ టి టి సీజన్ తెలుగులో కంప్లీట్ అయింది. బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించగా ... మూడవ సీజన్ నుండి అన్ని సీజన్ లకి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటి వరకు ఎన్టీఆర్ తీసుకున్నంత పారితోషకాన్ని మరెవరు బిగ్ బాస్ తెలుగు సీజన్ లకి హోస్ట్ గా వ్యవహరించిన వారు తీసుకోలేదు అని కూడా ఓ వార్త వైరల్ అవుతుంది.