పెళ్ళైన పది రోజులకే ప్రెగ్నెన్సీ.. హీరోయిన్ రిప్లై ఇదే?
ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఎక్కువగా ఈ మధ్యకాలంలో అయితే సినీ సెలెబ్రెటీల గురించి నెగిటివిటీని పెంచే విధంగానే ఎన్నో పోస్టులు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇలా సెలబ్రెటీలపై పుట్టుకొచ్చిన పుకార్లకు ఆయా సెలబ్రిటీలు స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడంతోనే చివరికి ఈ వార్తలకు చెక్ పడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఒక బాలీవుడ్ నటి గురించి ఇలాంటి వార్త ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారిపోయింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న కేవలం పది రోజులకే ఆమె గర్భం దాల్చింది అంటూ ఒక వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది.
అయితే ఇలాంటి వార్తలు రాస్తే ఎవరైనా సీరియస్ అవుతారు. కానీ సదరు నటి మాత్రం ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది బాలీవుడ్ స్టార్ నటుడు రాజకీయ నేత అయిన శత్రుజ్ఞ సిన్హ కూతురు సోనాక్షి సిన్హా ప్రియుడు జహీర్ ఇక్బాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏదేళ్లుగా వీరు సహజీవనం చేస్తున్నారు. ఇటీవల పెళ్లితో తమ ప్రేమకు ప్రమోషన్ ఇచ్చారు. అయితే పెళ్లైన పది రోజులకే సోనాక్షి సిన్హా గర్భం దాల్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సోనాక్షి స్పందిస్తూ జీవితం మనం అనుకున్నంత గొప్పగా ఉండదు. నాకు పెళ్లైన తర్వాత జీవితంలో పెద్ద మార్పేమి జరగలేదు. ఇప్పుడు ఎలా ఉందో పెళ్ళికి ముందు అలాగే ఉంది. ఇప్పుడు నేను నా భర్త హ్యాపీగానే ఉన్నాము. త్వరలో షూటింగ్ లు మొదలు పెడతాము. నేను మా భర్త కలిసి హాస్పిటల్ వైపు అస్సలు వెళ్ళమని.. ఎందుకంటే అలా వెళ్తే నాకు ప్రెగ్నెన్సీ అని అందరు అనుకుంటారు అంటూ ఫన్నీగా సమాధానం చెప్పింది సోనాక్షి సిన్హా.