జింబాబ్వేతో టి20 సిరీస్.. ఇండియన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్?

praveen
ఇటీవల వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసి వరల్డ్ కప్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్పుతో అటు బార్బీ హౌస్ నుంచి ఇండియా చేరుకుంది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో భాగమైన ఆటగాళ్లు అందరూ కూడా ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు అని చెప్పాలి. ఇక ఆయా ఆటగాళ్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సన్మానాలు చేస్తూ ఉన్నాయి. ఇక ఇటీవలే టీమిండియా ఆటగాళ్లు అందరు కూడా ముంబై వీధుల్లో భారీ రోడ్ షో నిర్వహించగా.. లక్షలాది మంది అభిమానులు తరలి వెళ్లారు.

 ఇలా సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా బిజీగా ఉండగా.. మరోవైపు యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ కెప్టెన్సీలో అటు జింబాబ్వే పర్యటనకు వెళ్ళింది టీమిండియా. ఈ క్రమంలోనే జింబాబ్వేతో ఐదు మ్యాచ్లో టి20 సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టి20 సిరీస్ కోసం ఇప్పటికే కెప్టెన్ గిల్ తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా జింబాబ్వే చేరుకున్నారు. కాగా నేడు హరారే స్పోర్ట్స్ క్లబ్లో సిరీస్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సిరీస్ కంటే ముందు అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. దీంతో ఇది తెలిసి అందరూ నిరాశలో మునిగిపోతున్నారు.

 జింబాబ్వే టీమ్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ ను ప్రపంచకప్ మ్యాచ్లను చూసినట్లుగా మొబైల్లో ఉచితంగా చూడలేరు. అయితే ఈ సిరీస్ లోని అన్ని మ్యాచ్లను ఉచితంగా టీవీలో చూసేందుకు అవకాశం ఉంది. కానీ మొబైల్లో మాత్రం అన్ని మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చూడలేరు. ఎందుకంటే ఇది చూడాలి అంటే తప్పకుండా సబ్ స్క్రిప్షన్  తీసుకోవాల్సిందే. ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సోనీ లీవ్ యాప్ లో రూ.399 నుంచి 149 రూపాయల వరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే ఈ మ్యాచ్ మొబైల్ లేదా లాప్టాప్లలో ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు అవకాశం ఉంటుంది. కాగా సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ విషయం తెలిసి టీమిండియా ఫ్యాన్స్ షాక్ లో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: