ఇక పిఠాపురం పవన్ దే..మూగబోయిన వర్మ గొంతు.?

Pandrala Sravanthi
పిఠాపురం పేరు చెప్పగానే ప్రస్తుతం అందరికీ గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్ మాత్రమే. మరి పవన్ కళ్యాణ్ ఈ పొజిషన్లో ఉన్నాడు అంటే దానికి ప్రధాన త్యాగశీలి  శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ. ఈయనను ముద్దుగా పిఠాపురం వర్మ అని పిలుస్తారు. ఈయన తన సీటును త్యాగం చేశాడు కాబట్టే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవగలిగాడు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయగలిగాడు. అలాంటి పిఠాపురం వర్మ పరిస్థితి ఇక పిఠాపురంలో ముగిసినట్టే అని తెలుస్తోంది. ఆయన ప్లేస్ ను పూర్తిగా పవన్ కళ్యాణ్ భర్తీ చేశారని చెప్పవచ్చు. ఆయన ఉంటే పవన్ కళ్యాణ్ కింద ఉండాలి లేదంటే మరో నియోజకవర్గం చూసుకోవాలి.  ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి గత పది సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడుతూ వస్తున్నారు. 

అయితే పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుంచి ఇప్పటికే పోటీ చేసి ఓడిపోయారు.  కానీ 2024 ఎన్నికల్లో మాత్రం వర్మ త్యాగం చేయడం వల్ల పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అలాంటి పవన్ కళ్యాణ్ కు  ఈసారి గెలుపు వరించడమే కాకుండా తన జనసేన పార్టీ కూడా దేశస్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఇదే తరుణంలో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు.. పవన్ కళ్యాణ్ అంటే హైదరాబాదులో ఉంటాడు ఇక్కడేం పాలన అందిస్తాడని ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఇక పిఠాపురంలోనే స్థిరపడాలని భావించారట. అంతేకాదు పిఠాపురంలోని తుని లో మూడు ఎకరాల స్థలం కూడా కొన్నారట.  

ఆ స్థలానికి సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తిచేసుకుని పిఠాపురం ప్రజలను ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కలిశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం నాది ఇక్కడ ప్రజలకు పూర్తిస్థాయి సేవలు చేస్తాను. ఇక్కడ మూడు ఎకరాల భూమి కూడా కొన్నాను. ఇక నేను హైదరాబాదీని కాదు పిఠాపురం మనిషినే అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇక్కడ స్థిరపడిపోవడంతో  ఇక భవిష్యత్తులో కూడా వర్మకు పిఠాపురం లో పోటీ చేసే అవకాశం రాదు కావచ్చని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి ముందు ముందు రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయి అనేది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: