నాగీ ప్రతి మూవీలో విజయ్, మాళవిక? ఎందుకో చెప్పేసిన నాగీ?

Purushottham Vinay

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 363 కోట్ల షేర్, 725 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఈ సినిమా ఇంకా కేవలం 9 కోట్లు వసూళ్లు చేస్తే చాలు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. నేటితో ఖచ్చితంగా లాభాల్లోకి వచ్చేస్తుంది. ఇక ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషించారు. దిశా పఠాని గ్లామర్ రోల్ లో బాగా మెప్పించింది.'కల్కి' సినిమా భారీ వసూళ్లతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు నాగ్ అశ్విన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాగీ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే సినిమాని చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన మాళవిక నాయర్, అలాగే కీలకపాత్రలో నటించిన విజయ్ దేవరకొండలను తను చేసిన మూడు సినిమాల్లో కూడా తీసుకున్నాడు. ఇక ఇదే విషయాన్ని రీసెంట్ గా ఒక మీడియా వారు నాగ్ అశ్విన్ ను అడగగా వాళ్ళని తీసుకోవడానికి కారణం చెప్పారు.


నా మొదటి సినిమాలో నటించిన నటి నటులు కాబట్టి వాళ్ళని లక్కీ పర్సన్స్ గా నేను భావిస్తాను. అందువల్లే వాళ్ళు నా సినిమాల్లో ఉంటే నాకు హెల్ప్ అవుతుందని, నా సినిమా సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతోనే వారిని నా సినిమాల్లో తీసుకుంటున్నాను తప్ప అంతకుమించి మరి ఏమి లేదని ఆయన చెప్పడం విశేషం… కల్కి 2 సినిమాను కూడా తొందర్లోనే సెట్స్ మీదికి తీసుకెళ్ళి శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి వీలైనంత ఫాస్ట్ గా ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.కల్కి 2 సినిమాలో గెస్ట్ అప్పిరియన్స్ ఉంటాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. కల్కి లో విజయ్ దేవర కొండ చేసిన క్యారెక్టర్ గెస్ట్ రోల్ కాదని నాగీ చెప్పాడు. అంటే అతనికి సంబంధించిన పాత్ర ఇంకా పార్టీ 2 లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. 600 కోట్ల భారీ బడ్జెట్ తో కల్కి 2898 ఏడి సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మించాడు.ఈ సినిమా రెండో భాగం కూడా రూపొందుతోందని, అందులో 60 శాతం పూర్తయిందన్న వార్త కూడా వినిపిస్తోంది. రెండో భాగంలో కొన్ని ముఖ్యమైన సీన్లను మాత్రం ఇంకా పూర్తిచేయాల్సి ఉందంటున్నారు. చాలా వరకు పూర్తయిపోయందనే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: