జగన్ కుటుంబ కథా చిత్రానికి ఎండ్ కార్డ్ పడినట్లేనా?

Purushottham Vinay

• జగన్ ఫ్యామిలీ పిక్చర్ కి ఎండ్ కార్డ్!

• ఊసరవెల్లిలా రంగులు మార్చడమే కారణం!

• ఇక రాజకీయాల్లో జగన్ ఫ్యామిలీ సినిమా ఆడటం కష్టమే!

ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. తన తండ్రి చనిపోయాక అధికారం ఇవ్వలేదని కాంగ్రెస్‌ పార్టీతో విభేదించి ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు. ఆ తరువాత తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో కొద్దిలో అధికారాన్ని అందుకోలేకపోయిన జగన్‌ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో మాత్రం జనాల్లో విపరీతమైన పాజిటివిటీ సంపాదించుకొని ఘనవిజయం సాధించారు. ఎంతలా అంటే అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో ఏకంగా 151 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేపట్టారు. జగన్ మోహన్ రెడ్డి బలపడిన సమయంలోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీ మెల్లగా అంతరించిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తీరు నచ్చని ఆంధ్రా ప్రజలు.. మెల్లగా వైఎస్సార్సీపీ వైపు మొగ్గారు. ఇప్పటికీ కూడా జగన్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీదే.151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో మొన్నటి దాకా చాలా బలంగా కనిపించిన జగన్ పార్టీ..ఇప్పుడు మాత్రం చాలా దారుణంగా బలహీనపడింది.

గతంలో ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఐదేళ్లు తిరిగే సరికి రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా ఓడిపోని రీతిలో చాలా దారుణంగా 11 సీట్లకే పరిమితమయింది. అయితే ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలపడే ప్రయత్నం చేస్తోంది.ఇక ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీలో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం నిర్వహించిన షర్మిల.. ఇప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో హస్తం పార్టీని బలోపేతం చేయడానికి అనేక వ్యూహాలు రచిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీకే కాదు షర్మిలకి కూడా షాక్ తగిలింది. ఎందుకంటే రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది. కాంగ్రెస్ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో తెలిసీ కూడా రాష్ట్ర పార్టీపగ్గాలను వైఎస్ షర్మిల చేపట్టారు.ఫలితంగా ఈ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి దారుణ ఓటమే ఎదరయింది. అంతేగాక షర్మిళపై కూడా నెగటివిటీ వచ్చింది.

2019 కి ముందు ysr ఫ్యామిలీ కలిసి మెలిసి ఉండి జనాల్లో పాజిటివిటీ సంపాదించుకుంది. కానీ 2024 లో అంతా రివర్స్ అయింది. కుటుంబంలో గొడవలు, అందరూ వేరయ్యి పోవడం, అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసిన తప్పులు, బాబాయ్ వివేకా హత్య హైలైట్ అవ్వడం, కజిన్ అవినాష్ జగన్ పక్కా ఉండటం, ఇంకో కజిన్ సునీత షర్మిళ పక్కన ఉండటం, తల్లి విజయమ్మ ఎటుపక్క ఉండాలో తేల్చుకోలేని అయోమయంలో ఉండటం..ఇవన్నీ కూడా ysr ఫ్యామిలీపై జనాల్లో నెగటివిటీని పెంచాయి. వీళ్ళ మాటల్లో క్లారిటీ లేకపోవడం ఇవన్నీ కూడా జనాలకి నచ్చలేదు. ఊసరవెల్లిలా ఇన్నీ రంగులు మార్చిన జగన్ ఫ్యామిలీ పై జనాల్లో పూర్తిగా నమ్మకం కూడా పోయింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ వీళ్ళని జనాలు నమ్మేలా లేరు. దాంతో జగన్ కుటుంబ కథా చిత్రం ఇక ఎండ్ అయిపోయినట్లేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: