ఓటీటీ నో.. టీవీ ప్రీమియర్ ఓకే.. అఖిల్ "ఏజెంట్" మూవీ కి ఇంతా సస్పెన్స్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అక్కినేని అఖిల్ కొంత కాలం క్రితం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అయినటువంటి ఏజెంట్ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా , ఈ మూవీ కి హిప్ హాప్ తమిజ సంగీతం అందించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడు అయినటువంటి సురేందర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , కెరియర్ ప్రారంభంలో వరుస అపజాయలను ఎదుర్కొన్న అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్" బ్యాచిలర్ మూవీ తో పర్వాలేదు అనే విషయాన్ని అందుకున్నాడు.

ఈ మూవీ తర్వాత అఖిల్ హీరోగా రూపొందిన సినిమా కావడంతో ఏజెంట్ మూవీ పై ప్రేక్షకుల్లో కాస్త మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ సోనీ లీవ్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఓ టీ టీ లోకి ఇప్పటికి కూడా ఎంట్రీ ఇవ్వలేదు. ఇక ఈ మూవీ ఓ టి టి లోకి రాకముందే బుల్లి తెరపై ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క హిందీ వర్షన్ సాటిలైట్ హక్కులను గోల్డ్ మైన్ టీవీ ఛానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ గోల్డ్ మైన్ టీవీ ఛానల్ లో ప్రసారం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ మూవీ లో మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి ఓ కీలకమైన పాత్రలో నటించగా ... వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: