ఆ క్లాస్ డైరెక్టర్ తో నాని నెక్స్ట్ మూవీ..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో నాని ఒకరు. ఈయన సినీ పరిశ్రమలోకి ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి , ఆ తర్వాత ఒక్కో విజయాన్ని అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరో స్థాయికి ఎదిగారు. ఈ నటుడు పోయిన సంవత్సరం మొదటగా దసరా అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత హాయ్ నాన్న అనే క్లాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నాడు.

ప్రస్తుతం నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నాని కొంతకాలం క్రితం బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వేణుతో , అలాగే సుజిత్ దర్శకత్వంలో చలో మూవీ చేయడానికి రెడీ అయ్యారు. కాకపోతే సుజిత్ , నానితో అనుకున్న మూవీకి బడ్జెట్ బాగా ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ మూవీ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వచ్చాయి.

ఇక బలగం వేణు చెప్పిన కథ నాని ఇది వరకు చేసిన దసర సినిమాకు దగ్గరగా ఉండడంతో ఆ మూవీ ని కూడా నాని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే సరిపోదా శనివారం సినిమా చివరి దశకు వచ్చిన సమయంలో నాని తాజాగా ఓ క్రేజీ దర్శకుడితో మూవీ ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాని తన తదుపరి మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాని , శేఖర్ ఇద్దరు కథా చర్చలు జరుపుతున్నట్లు ఒక వేళ శేఖర్ చెప్పిన కథ నానికి నచ్చినట్లయితే ఈ కాంబోలో మూవీ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: