కల్కి 2898 AD : నాగ్ అశ్విన్ ఆ ఒక్క నటుడిని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాడు..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు ఈయన నాగ్ అశ్విన్ "ఎవడే సుబ్రహ్మణ్యం" మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టి మహానటి మూవీ తో మంచి విజయాన్ని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు ప్రభాస్ హీరో గా రూపొందిన కల్కి 2898 AD అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.  ఈ మూవీ జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి.

 ఇది ఇలా ఉంటే నాగ్ అశ్విన్ ఎక్కువ శాతం తాను గతంలో దర్శకత్వం వహించిన సినిమాలలో ఏ నటీనటులు అయితే ఉంటారో వారితోనే మరోసారి సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటాడు. అందులో భాగంగా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కీలక పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ , హీరోయిన్ గా నటించిన మాళవికా నాయర్ ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మహానటి సినిమాలో కూడా ముఖ్య పాత్రలలో నటించారు. ఇక తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమాలో కూడా విజయ్ దేవరకొండ , మాళవిక నాయర్ చిన్న చిన్న పాత్రలలో నటించారు.

వీరి పాత్రల నడిపి ఈ సినిమాలో తక్కువే అయినప్పటికీ అత్యంత కీలకమైన పాత్రలలో ఈ ఇద్దరు నటించారు. ఇకపోతే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా హీరో అయినటువంటి నాని తో మాత్రం ఇప్పటి వరకు ఈయన మరో సినిమా చేయలేదు. కల్కి సినిమాలో నాని కూడా ఓ చిన్న పాత్రలో నటించాడు అని వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమాలో నాని లేడు. మరి నాని ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల అతనిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకే నాగ్ అశ్విన్ అతనితో సినిమాలు చేయడం లేదు అని చాలా మంది అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: