అందరినీ టెన్షన్ పెడుతున్న బాలయ్య.. ఆ ఒక్క అప్డేట్ వస్తే అంతా ఓకే..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం చాలా మంది హీరోలను టెన్షన్ పెడుతున్నాడు. ఎందుకు అనుకుంటారు అసలు విషయంలోకి వెళ్దాం... ప్రస్తుతం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో "ఎన్ బి కె 109" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ఊర్వసి రౌటెలా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ యొక్క విడుదల తేదీని మాత్రం మేకర్స్ అనౌన్స్ చేయలేదు.

 దానితో ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది అని ఒక వార్త వైరల్ అవుతూ ఉంటే , అదే సమయంలో ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్లు మరో వార్త వైరల్ అవుతుంది. ఈ రెండు వార్తలతో పాటు ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో కూడా ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈ మూవీ విడుదలకు సంబంధించి అనేక వార్తలు బయటకు వస్తున్న ఈ మూవీ బృందం మాత్రం ఈ సినిమా విడుదలపై ఏ విధంగానూ స్పందించడం లేదు.

దానితో ఈ మూవీ ని ఎప్పుడు విడుదల చేస్తారా అని అనేక మంది హీరోలు , నిర్మాతలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే ప్రస్తుతం బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. దానితో ఆయన నటిస్తున్న "ఎన్ బి కే 109" మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానితో వారి సినిమా విడుదల తేదీన అనౌన్స్ చేసిన తర్వాత అదే తేదీన లేక దానికి దగ్గరన బాలకృష్ణ సినిమా రిలీజ్ ఉన్నట్లు అయితే కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో అనేక మంది నిర్మాతలు , హీరోలు ఎన్ బి కె 109 మూవీ విడుదల తేదీ గురించి ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య తాను హీరోగా రూపొందుతున్న "ఎన్ బి కే 109" మూవీని ఏ తేదీన విడుదల చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: