'టాక్సిక్'పై పుకారు.. కియారా గరం గరం రియాక్షన్!
కియారా అద్వానీ కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం 'టాక్సిక్'లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కోసం కియారా ఒక కండిషన్ పెట్టిందని, తాను నటించే ఇంటిమేట్ సీన్ల డోస్ తగ్గించాలని టీమ్‌ను డిమాండ్ చేసిందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కథనాలు హోరెత్తాయి. 'పెళ్లి తర్వాత కియారా మారిపోయిందని', 'తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కోసం ఈ నిర్ణయం తీసుకుందని' రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.ఇన్నాళ్లూ ఈ పుకార్లపై మౌనంగా ఉన్న కియారా, చివరకు తనదైన శైలిలో స్పందించింది. ఒక ప్రముఖ మీడియా సంస్థ రాసిన కథనం తాలూకు స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "ఇది పూర్తిగా అర్థరహితం (Absolute nonsense)" అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. తాను అలాంటి ఎలాంటి కండిషన్లు పెట్టలేదని, అన్నీ అబద్ధపు వార్తలేనని కియారా తేల్చి చెప్పేసింది. దీంతో కియారా గురించి మీడియాలో నడుస్తున్న ప్రచారం అవాస్తవమని స్పష్టమైంది.
సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో గ్లామర్ విషయంలో ఎంతో ఓపెన్‌గా ఉండే హీరోయిన్లు, సౌత్ సినిమాల విషయానికొచ్చేసరికి ఎందుకు ఇలాంటి వార్తలు వస్తాయన్నది పెద్ద ప్రశ్న. 'వార్-2' సినిమాలో హృతిక్ రోషన్ పక్కన కియారా వేసుకున్న బికినీ లుక్, ఆ సినిమాలో ఆమె చేసిన ఎక్స్‌పోజింగ్ ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అటు బాలీవుడ్‌లో ఎంత బోల్డ్ పాత్ర అయినా చేయడానికి సిద్ధపడే కియారా, సౌత్ మూవీ 'టాక్సిక్' విషయంలో ఇంత చిన్నపాటి నిబంధనలు పెడుతుందనుకోవడం ఎంతవరకు సమంజసం? అనేది ఇప్పుడు నెటిజన్ల మధ్య జరుగుతున్న చర్చ. కియారా తాజాగా హాజరైన పలు ఈవెంట్లలోనూ ఆమె స్టైలిష్‌గా, హాట్‌గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. దీన్ని బట్టి ఆమె గ్లామర్ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వదని అర్థమవుతోంది.
'టాక్సిక్' మూవీ కేవలం కియారా చుట్టూ మాత్రమే తిరుగుతున్న సినిమా కాదు. ఇందులో తారల జాతర కనిపిస్తోంది. కియారాతో పాటు నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి వంటి కీలకమైన నటీమణులు ఇందులో నటిస్తున్నారు. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉన్న కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దర్శకుడు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'టాక్సిక్' చిత్రం గురించి మరో కీలకమైన అప్‌డేట్ కూడా బయటకొచ్చింది. వాస్తవానికి ఈ సినిమా మొదటి భాగాన్ని జూన్ 4న విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేసింది. అయితే ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాల మార్కెట్‌పై, అలాగే అంతర్జాతీయ బాక్సాఫీస్ లెక్కలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఇంకా చక్కబడకపోవడంతో, భారీ బడ్జెట్ సినిమాలను అక్కడ విడుదల చేయడం రిస్క్‌తో కూడుకున్న పని అని నిర్మాతలు భావించారు.అందుకే, ఈ సినిమాను మరికొంత కాలం వాయిదా వేయడమే మంచిదని టీమ్ నిర్ణయించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ఆగస్టులో వచ్చే 'ఇండిపెండెన్స్ డే' వీకెండ్‌లో విడుదల చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.